బాహుబలి2ని రిలీజ్ కాక ముందే చంపేస్తున్న కట్టప్ప

First Published Apr 11, 2017, 10:40 AM IST
Highlights
  • బాహుబలి2ని రిలీజ్ కాక ముందే చంపేస్తున్న కట్టప్ప
  • కావేరి జలాలపై సత్యరాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని కన్నడిగుల ఆరోపణ
  • బాహుబలి 2 రిలీజ్ ను అడ్డుకుంటామని ఆందోళనకారుల హెచ్చరిక, 28న బంద్

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనేది బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరిని గత రెండేళ్లుగా వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలా మంది ఎదురు చూసేట్టు చేస్తోంది. బాహుబలి సినిమాలో అంతటి కీలకమైన పాత్ర పోషించిన కట్టప్ప ఇప్పుడు ఈ చిత్రానికి ఒక తలనొప్పిగా మారాడు. 

 

కావేరీ జలాల వినియోగంపై నటుడు సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలు కర్నాటక ప్రజల్ని హర్ట్‌ చేసాయి. దాంతో అతడు నటించిన సినిమాలని కర్నాటకలో విడుదల కానీయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. అతను బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఏప్రిల్‌ 28న కర్నాటకలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని అంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌ 28న కర్నాటక బంద్‌ కూడా తలపెట్టారు నిరసనకారులు.

 

నిజానికి కర్నాటక చరిత్రలోనే బాహుబలి అతి పెద్ద విజయాన్ని సాధించింది. దాంతో రెండో భాగంపై ఇంకా భారీ స్థాయిలో వ్యాపారం జరిగింది. ఇప్పుడీ వ్యవహారం ముదిరి సినిమా ప్రదర్శన కనుక నిలిచిపోతే.. నలభై కోట్లు పెట్టి హక్కులు తీసుకున్న బయ్యర్‌ మునిగిపోతాడు. ఎగ్జిబిటర్లు కూడా తీవ్రంగా నష్టపోతారు. ఈ సమస్యకి పరిష్కారాన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంత మంచిదని కర్ణాటక బాహుబలి వ్యాపారులు కోరుతున్నారు.

 

మరి బాహుబలికి నష్టం జరగకుండా సత్యరాజ్‌ పూనుకుని ఈ వివాదానికి తెర వేయాలని కోరుకుంటున్న వారి కోసం కట్టప్ప దిగి వస్తాడా? లేదా... చూద్దాం.

click me!