అల్లు అర్జున్ 'అలకనంద'

Published : Apr 15, 2019, 09:15 PM IST
అల్లు అర్జున్ 'అలకనంద'

సారాంశం

కొన్నిరోజుల క్రితం బన్నీ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ షూటింగ్ ను చిత్ర యూనిట్ త్వరలోనే స్టార్ట్ చేయనుంది. అయితే సినిమాకు సంబందించిన రూమర్స్ పై చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. 

మెయిన్ గా టైటిల్స్ పై రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ అలకనందా అని అఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి - అరవింద సమేత సినిమాలకు మొదట 'అ' అక్షరం తో స్టార్ట్ తో చేసినట్లుగానే ఇప్పుడు బన్నీ సినిమాకు కూడా అదే తరహాలో సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ టైటిల్ లో విశేషమేమిటంటే.. బన్నీ బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ పేరు అలకనంద. ఆ సినిమా బన్నీకి అంతగా సక్సెస్ ఇవ్వలేదు. మరి త్రివిక్రమ్ మాయతో ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..