
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్ర మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది. ఊహించని విధంగా అల్లు అర్జున్ కి పుష్ప చిత్రం పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనితో పుష్ప పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ నేడు బెంగుళూరుకు పయనం కాబోతున్నాడని న్యూస్ ఆసక్తికరంగా మారింది. అయితే అల్లు అర్జున్ బెంగుళూరుకు వెళుతోంది ఏ సినిమా కోసమే, మరేదైనా ఈవెంట్ కి హాజరయ్యేందుకో కాదు. గత ఏడాది అక్టోబర్ లో దేశం మొత్తాన్ని తీవ్ర విషాదంలో ముంచుతూ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే.
దీనితో టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలంతా పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ మృతికి నివాళులు అర్పించారు. రాంచరణ్ వ్యక్తిగతంగా హాజరై పునీత్ ఫ్యామిలీని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్, రానా లాంటి హీరోలంతా పునీత్ కు నివాళులు అర్పించారు.
ఇదిలా ఉండగా నేడు అల్లు అర్జున్ బెంగుళూరులో పునీత్ ఫ్యామిలీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని బన్నీ పరామర్శించనున్నారు. ఆ సమయంలో బన్నీ పుష్ప బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వెళ్లడం కుదర్లేదు. అల్లు అర్జున్, పునీత్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
గత ఏడాది అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ తన నివాసంలో జిమ్ వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిది. దీనితో పునీత్ మరణించారు.