Pushpa:'పుష్ప' స్టైల్ లో నిజ జీవితంలో ఎర్ర చందనం స్మగ్లింగ్, అరెస్ట్

Surya Prakash   | Asianet News
Published : Feb 03, 2022, 11:20 AM IST
Pushpa:'పుష్ప'  స్టైల్ లో నిజ జీవితంలో ఎర్ర చందనం స్మగ్లింగ్, అరెస్ట్

సారాంశం

పుష్ప సినిమాలో  పాల క్యాన్లు కింద ఒక ప్రత్యేక అర ఏర్పాటు చేసి అక్కడ ఎర్రచందనం దుంగలను పెట్టి పైన పాలను పోసి ఇక ఎవరికి తెలియకుండా ఎర్రచందనం స్మగ్లింగ్  చేస్తూంటాడు హీరో.  ఇక అచ్చం ఇలాగే

 
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా  ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో  తెలిసిందే. బాలీవుడ్ ను సైతం ఈ చిత్రం షేక్ చేసి, అక్కడ రూ. 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరింది. దక్షిణాది సినిమాల పవర్ ఏంటో బాలీవుడ్ కు చూపించింది. ఈ సినిమాలో హీరోను ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించారు. అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదే లే' డైలాగ్ చాలా పాపులర్ అయింది. అయితే నిజ జీవితంలో ఓ స్మగ్లర్ ...పుష్ప స్టైల్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసి దొరికిపోయారు.
 
పుష్ప సినిమాలో  పాల క్యాన్లు కింద ఒక ప్రత్యేక అర ఏర్పాటు చేసి అక్కడ ఎర్రచందనం దుంగలను పెట్టి పైన పాలను పోసి ఇక ఎవరికి తెలియకుండా ఎర్రచందనం స్మగ్లింగ్  చేస్తూంటాడు హీరో.  ఇక అచ్చం ఇలాగే మొన్నటికి మొన్న నిషేధిత గుట్కా గంజాయి ప్యాకెట్లను వ్యాన్ లో కింద ఒక ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసి  పైన ఆయిల్ డ్రమ్ములు పెట్టి స్మగ్లింగ్  చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటి మరో ఘటనే జరిగింది.

ఓ స్మగ్లర్ ..అచ్చం పుష్ప సినిమాలో పుష్ప రాజ్  స్టైల్ లోనే....ఎర్రచందనం రవాణా చేస్తూ ఇటీవల పోలీసులకు చిక్కాడు. సయ్యద్ యాసీన్ అనే వ్యక్తి పుష్ప సినిమాలో లాగ కింద ఒక ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసి పైన పండ్లు పెట్టాడు. కరోనా బాధితులకు పండు సరఫరా చేస్తాను.. నేను చాలా మంచి వాడిని అని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆంధ్ర కర్ణాటక చెక్ పోస్టులలో పోలీసుల నుంచి తప్పించుకున్నా మహారాష్ట్ర చెక్ పోస్ట్ వద్దకు వచ్చేసరికి దొరికిపోయాడు. అక్కడ పోలీసులు   తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఏపీ నుంచి తెచ్చిన టువంటి 2.45 కోట్ల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గుర్తు తెలియని ప్రాంతం నుంచి వాటిని తీసుకెళ్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్రప్రదేశ్‌,  కర్ణాటక బార్డర్‌‌లలో పోలీసులను సులభంగా నమ్మించ గలిగినా.. చివరకు మహారాష్ట్ర  పోలీసులకు చిక్కాడు.  మహారాష్ట్రలో గాంధీ చౌక్‌ ప్రాంతంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీని వెనుక ఉన్న ముఠా ఎవరనే కోణంలో పోలీసులు  దర్యాప్తు వేగవంతం చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన