శర్వా మహాసముద్రం లో  కెజిఎఫ్ విలన్

Published : Jun 26, 2021, 02:46 PM IST
శర్వా మహాసముద్రం లో  కెజిఎఫ్ విలన్

సారాంశం

 వైజాగ్ నేపథ్యంలో సాగే మహాసముద్రం సినిమాపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. కాగా నేడు ఈ చిత్రం నుండి మెయిన్ విలన్ గరుడ రామ్ ని పరిచయం చేశారు. కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీలో నటించిన గరుడ రామ్ లుక్ మాస్, డేంజరస్ గా ఉంది.


ఆర్ ఎక్స్ 100 మూవీతో సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆయనకు అది డెబ్యూ మూవీ కాగా ఒక్క సినిమాతో పాప్యులర్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. అయితే ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కి మరో హీరో దొరకడానికి రెండేళ్ల సమయం పట్టింది. హీరో రవితేజ సినిమా చేస్తానని మాటిచ్చి హ్యాండిచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వరస్ట్ హీరో అంటూ అజయ్ భూపతి చేసిన ట్వీట్ వైరల్ కావడం జరిగింది. 


కాగా అజయ్ భూపతి గత ఏడాది మహాసముద్రం మూవీ ప్రకటించారు. శర్వానంద్, సిద్దార్ధ హీరోలుగా క్రైమ్ అండ్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. కాగా నేడు ఈ చిత్రం నుండి మెయిన్ విలన్ గరుడ రామ్ ని పరిచయం చేశారు. కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీలో నటించిన గరుడ రామ్ లుక్ మాస్, డేంజరస్ గా ఉంది. 


కొద్దిరోజుల క్రితం గూని బాబ్జిగా రావు రమేష్ రోల్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. అజయ్ భూపతి మహాసముద్రం పాత్రలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక అను ఇమ్మానియేల్, అదితి రావ్ హైదరి మహాసముద్రం సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు . 


 

PREV
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌