ఆరుబయట మంచమేసుకుని పిల్లలతో ఆడుకుంటున్న అల్లు అర్జున్, వైరల్ అవుతున్న క్రేజీ వీడియో

Published : Apr 16, 2023, 02:25 PM IST
ఆరుబయట మంచమేసుకుని పిల్లలతో ఆడుకుంటున్న అల్లు అర్జున్,  వైరల్ అవుతున్న క్రేజీ వీడియో

సారాంశం

సినిమాలకు ఎంత టైమ్ ఇస్తాడో.. తన కుటంబానికి.. పిల్లలకు కూడా అంతే టైమ్ ఇస్తాడు అల్లు అర్జున్. ఖాళీగా ఉంటే.. పిల్లలతో ఆడుకుంటూ.. టైమ్ గడిపేస్తుంటాడు. రీసెంట్ గా బన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలె వైరల్ అవుతోంది. 

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటు సినిమాలు.. అటు ఫ్యామిలీ.. రెండింటిని బ్యాలన్స్ చేస్తూ.. లైప్ ను లీడ్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్స్ ఎంత ముఖ్యమో.. తన కుటుంబం పిల్లలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు  అల్లు అర్జున్.  తన పిల్లలైన అర్హా మరియు అయాన్‌లతో కలిసి పిల్లాడిలా మారిపోతుంటాడు బన్నీ. సరదాగా వారితో కలిసి ఆడుకుంటాడు.. ఈ వీడియోలు. ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే అల్లు అర్జున్ కాని.. లేకపనోతే ఆయన భార్య స్నేహా కాని.. నెట్టింట్లో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. 

అటు అభిమానులు కూడా వీరి ఫోటోలు వీడియోల కోసం ఎదురుచూస్తుంటారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఇక తాజాగా అల్లు అర్జున్ పిల్లలతో ఆడుకునే వీడియోన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలతో కలిసి తన లాన్ లో..నవ్వారు మంచం వేసుకుని.. ఆకాశం వైపు చూపిస్తూ.. పిల్లలిద్దరికి సరదాగా కబుర్లు చెపుతున్నాడు అల్లు అర్జున్.  పచ్చిక మీద ఆడుకుంటూ.. చల్లని వాతావరణంలో..నేచురల్ గాలిని పిల్లలకుఅందిస్తూ.. ఆరుబయట ఆడుకుంటున్నారు. దాంతో నెటిజన్లు అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

పిల్లలను ఏసీగదులకేపరిమితం చేయకుండా.. ఇంత పెద్ద స్టార్ అయ్యిుండి... ఇలా సరదాగా ఆరుబయట మంచం వేసుకుని.. పిల్లలకు స్వచ్చమైన గాలి పీల్చుకునే అవకాశం ఇస్తున్నందుకు ప్రసంశీస్తున్నారు. ఇక ఈ వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహం రెడ్డి  తనఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నారు, ఇక ఈ వీడియో వైరల్‌గా మారింది మరియు అభిమానుల నుండి మరియు నెటిజన్ల నుండి ప్రేమ మరియు ప్రశంసలను పొందుతోంది. ఇక సమంత రీసెంట్ గా నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హా ఓ పాత్రలో మెరిసింది. ఇక అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ హడావిడిలో ఉన్నాడు. రీసెంట్ గా బన్నీ బర్త్ డేకి రిలీజ్ చేసిన స్పెషల్ లుక్.. పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇక ఈసినిమా తరువాత బన్నీ.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డితో సినిమా చేయబోతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?