pushpa Controversy: అవమానం జరిగింది, స్టేజీపై బన్నీతో క్షమాపణ

Surya Prakash   | Asianet News
Published : Dec 15, 2021, 06:24 PM ISTUpdated : Dec 15, 2021, 06:26 PM IST
pushpa Controversy:  అవమానం జరిగింది, స్టేజీపై బన్నీతో  క్షమాపణ

సారాంశం

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బన్నీ సారీ చెప్పడంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం చేస్తున్నారు. వేరే ఇండస్ట్రీ హీరో కాబట్టి ఇలా అడగగలుగుతున్నారు..  

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన సినిమా పుష్ప. డిసెంబర్‌17న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది. పాన్‌ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో సినిమాను భారీఎత్తున ప్రమోట్‌ చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బన్ని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగింది?
  
వివరాల్లోకి వెళితే..అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి లేటుగా రావడంపై కన్నడ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయం 11.15 నిమిషాలకు ప్రెస్ మీట్ అని చెప్పి.. మీరు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఎలా వస్తారని, ఇక్కడ మీడియాను మీరు అవమానించినట్లే అని ఒక రిపోర్టర్ కొద్దిగా ఘాటుగానే ప్రశ్నించాడు.. ఇక దీనికి బన్నీ సమాధానం చెప్తూ ” ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉందని నాకు ఇందాకే తెలిసింది.. తెలిసిన వెంటనే ప్రైవేట్ జెట్ లో బయల్దేరాను.. మధ్యలో పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్ ఇష్యూ వలన కొద్దిగా లేట్ అయ్యింది.. మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి.. ఇది ఎవరిని హార్ట్ చేయాలనీ చేయలేదు.. సారీ.. సారీ అని చెప్పుకొచ్చారు. 

అంతే కాకుండా సారీ చెప్తే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అని తనదైన స్టైల్ ల్లో బన్నీ తెలిపిన విధానం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బన్నీ సారీ చెప్పడంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం చేస్తున్నారు. వేరే ఇండస్ట్రీ హీరో కాబట్టి ఇలా అడగగలుగుతున్నారు.. అదే మీ కన్నడ హీరోలను ఇలా నిలదీయగలరా..? అని కొంతమంది అంటుంటే.. ప్రెస్ మీట్ లో బన్నీ హ్యాండిల్ చేసిన విధానం బావుంది.. అందుకే ఆయన ఐకాన్ స్టార్ గా మారాడు అని మరికొందరు అంటున్నారు.  

అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా నటించిన `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో క్షణం తీరిక లేకుండా బన్నీ బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస బెట్టి ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు ముంబయిలో స్టూడియోలో దర్శకుడు సుకుమార్‌ ఫస్ట్ కాపీని రెడీ చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఒక్క రోజు గ్యాప్‌తో విడుదల కావాల్సిన సినిమా వర్క్ ఇంకా పూర్తికాలేదనే వార్త ఇప్పుడు అభిమానులను ఆందోళనకి గురి చేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి