RRR : రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ట్రైలర్.. కేవలం ఆరు రోజుల్లోనే

Published : Dec 15, 2021, 05:16 PM ISTUpdated : Dec 15, 2021, 05:21 PM IST
RRR : రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ట్రైలర్.. కేవలం ఆరు రోజుల్లోనే

సారాంశం

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది ట్రిపుల్ ఆర్ ట్రైలర్. భారీ వ్యూవర్ షిప్ తో దూసుకుపోతోంది. యూట్యూబ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది ట్రిపుల్ ఆర్(RRR) ట్రైలర్.   

ఎన్టీఆర్‌(Ntr), రామ్‌ చరణ్‌( Ram Charan)  హీరోలుగా రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో.. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతో..న్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఆర్ఆర్‌ఆర్‌’.  తెలుగు, తమిళ‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కబోతోంది ట్రిపుల్ ఆర్(RRR). ఇక ఈమూవీ నుంచి ఈనెల 9న రిలీజ్ అయిన ట్రైలర్ రికార్డ్  వ్యూస్ తో దూసుకుపోతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 10 కోట్ల వ్యూస్ ను క్రాస్ చేసి పరుగులు పెడుతోంది ట్రైలర్. దీనికి సంబంధించన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. అతి తక్కువ టైమ్ లో ఈ ఘనత సాధించిన సినిమాగా ట్రిపుల్ ఆర్  ట్రైలర్‌ నిలిచింది.

 

అలియా భట్‌(Alia Bhat), అజయ్‌ దేవగణ్‌(Ajay Devagan), శ్రీయా  కీలక పాత్రలు చేస్తున్న ఈమూవీకి  కీరవాణి(Keeravani) మ్యూజిక్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజ్ కు చాలా తక్కువ టైమ్ ఉండటంతో ప్రమోషన్ హడావిడిలో పడిపోయారు మూవీ టీమ్. రాజమౌళితో పాటు హీరోలు ఇద్దరూ ప్రమోషన్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. 

 

పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు కలిసి బ్రిటిష్‌ వారిపై ఏవిధంగా పోరాటం చేశారన్న కోణంలో ఫిక్షనల్‌ స్టోరీగా రాజమౌళి ట్రిపుల్ ఆర్ ను తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. సీతగా ఆలియా భట్ నటించారు. డివివి దానయ్య(Dvv Danayya) ట్రిపుల్ ఆర్ సినిమాను  నిర్మించారు. 
 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం