Latest Videos

AP Cinema Ticket prices Row : థియేటర్స్ పై రైడింగ్, స్ట్రిక్ట్ యాక్షన్, Pushpa పై ఎఫెక్ట్..?

By Surya PrakashFirst Published Dec 15, 2021, 6:09 PM IST
Highlights

సింగిల్ బెంచ్ తీర్పు కాపీ అందకపోవటంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. రేపు గురువారం సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సినిమాలు విడుదలైన సమయంలో పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు థియేటర్ యజమానులకు అవకాశం కలిగినట్లైంది. రానున్న రోజుల్లో రిలీజ్ అయ్యే పెద్ద చిత్రాలకు ఉపశమనం కలిగిందని ఇండస్ట్రీ జనాలందరూ  ఆనందంగా ఉన్నారు.

అయితే వారందరికీ మరోసారి షాక్ ఇస్తూ సినిమా టికెట్ ధరల జీవో నెం.35 రద్దుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజనల్ బెంచిలో అప్పీల్ చేసింది. దీనిపై ప్రభుత్వ వాదనలు వినాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేసింది. ఈరోజు ఈ పిటిషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు జరగాల్సి ఉంది. సింగిల్ బెంచ్ తీర్పు కాపీ అందకపోవటంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. రేపు గురువారం సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.

మరో ప్రక్క  ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ తనిఖీకి సిద్ధం అయినట్లు సమాచారం. ఈ సాయంత్రానికి అన్ని థియేటర్స్ ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మార్వోలు, వీఆర్వోలు థియోటర్స్ పై రైడ్ చేసి, అక్కడ కోవిడ్ సేప్టీ,ఫైర్ సేప్టీ,ఎలక్ట్రిక్ సేప్టీ వగైరా  ప్రొటోకాల్స్ ఉన్నాయో లేవో పరిశీలించమని గవర్నమెంట్ ఆదేశించినట్లు సమాచారం. థియోటర్ లో రూల్స్ కు విరుద్దంగా ఉంటే కనుక స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ ఇంపాక్ట్ అంతా ఎల్లుండి రిలీజ్ అవుతున్న అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప సినిమాపై ఖచ్చితంగా పడుతుందని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు.
 
ఇక సామాన్య ప్రజానీకానికి వినోదం తక్కువ ధరలకే అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఏడాది ఏప్రిల్ లో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను గణనీయంగా తగ్గించింది. అలాగే సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా రోజులో ఎక్కువ షోలు ప్రదర్శిస్తున్నారంటూ.. థియేటర్లో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు - డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్స్ కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లారు.

click me!