
అల్లు అర్జున్ కి జంటగా రష్మిక (Rashmika Mandanna)నటించిన పుష్ప విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే చెన్నై, బెంగుళూరు,ముంబై వంటి నగరాల్లో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ (Allu Arjun) తో పాటు రష్మిక మందాన కూడా పాల్గొంటున్నారు. కాగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో రష్మిక ప్రవర్తనను ఉద్దేశిస్తూ నెటిజెన్ ఓ కామెంట్ చేశారు.
'అసలు దీన్ని హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నార్రా బాబు. దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం...' అంటూ ఆమె ఫోటోపై కామెంట్ చేశారు. ఈ కామెంట్ కి రష్మిక రిప్లై ఇచ్చారు. 'నాది యాక్టింగో ఓవర్ యాక్టింగో... జీవితంలో ఏదో ఒకటి సాధించాను... నువ్వేమి సాధించవు నాన్న?' అంటూ కౌంటర్ ఇచ్చింది. నన్ను విమర్శించే ముందు నీ సంగతి చూసుకో, నీకు ఆ అర్హత ఉందా?, అని అర్థం వచ్చేలా నెటిజెన్ నెగిటివ్ కామెంట్ కి రష్మిక ఘాటు సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం రష్మిక రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్నారు రష్మిక. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక, ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఈ వ్యవహారంలో రక్షిత్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే రశ్మికపై ఎలాంటి ట్రోలింగ్ కి పాల్పడవద్దని స్వయంగా రక్షిత్ శెట్టి తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్ గా సూపర్ ఫార్మ్ లో ఉన్న రష్మికకు అదే స్థాయిలో సోషల్ మీడియా వేధింపులు ఎదురవుతున్నాయి.
మరోవైపు రష్మిక ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప(Pushpa) రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఈరోజు నైట్ యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. దర్శకుడు సుకుమార్ రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కించారు. కెరీర్ లో మొదటిసారి రష్మిక డీగ్లామర్ రోల్ చేశారు. పుష్ప చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
Also read Keerthy Suresh photos: స్పెయిన్ లో మహేష్ హీరోయిన్ అందాలు చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న 'మహానటి'