‘కాంతార’కు హై కోర్టు షాక్ - ‘వరాహ రూపం’ పాట ఓటీటిల్లోనూ బ్యాన్

Published : Apr 17, 2023, 11:49 AM IST
  ‘కాంతార’కు హై కోర్టు షాక్ - ‘వరాహ రూపం’ పాట ఓటీటిల్లోనూ బ్యాన్

సారాంశం

 కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. 


కాంతార కన్నడ నుంచి వచ్చి సైలంట్ హిట్ కొట్టిన సినిమా. ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేశారు. అల్లు అరవింద ఈ సినిమాను తెలుగులో పొడ్యూస్ చేశారు. అయితే తెలుగులో కూడా కాంతార కాసుల వర్షం కురిపించింది. తెలుగులో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది కాంతార. అయితే ఈ సినిమా సక్సెస్ తో పాటు వివాదాలను మూటకట్టుకుంది. ‘కాంతార’ సినిమాకు ప్రాణమైన ఆ పాట వివాదంలో చిక్కుకుంది. సినిమా రిలీజై ఇన్నాళ్లవుతున్నా.. ఇంకా వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళ కోర్టు ఈ పాటపై కీలక తీర్పు ఇచ్చింది.
  
‘వరాహ రూపం’ పాటను తమ పాట నుంచి కాపీ చేశారంటూ కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ సినిమా విడుదలైనప్పటి నుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ మేరకు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ సాంగ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని, థియేటర్లు, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు, ఓటీటీ లలో ఎక్కడా ఈ సాంగ్ ను ప్లే చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మ్యూజిక్ బ్యాండ్ తైకుదం బ్రిడ్జ్‌, మాతృభూమి ప్రింటింగ్‌ కు ‘వరాహ‌ రూపం’ పాట క్రెడిట్ ఇవ్వాల‌ని కేరళ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. న‌వ‌ర‌సం ట్రాక్‌ ను కాపీ కొట్టి 'వ‌రాహ‌ రూపం' తీసిన‌ట్లు కోర్టు చెప్పింది. దీన్నుంచే నుంచే ప్రేర‌ణ పొంది వ‌రాహ‌రూపం పాట‌ను క్రియేట్ చేసిన‌ట్లు మ్యూజిక్ డైరెక్టర్ అంగీక‌రించార‌ని కోర్టు తెలిపింది. 

తెలుగులో ఈ పాట పడింది ఎవరో కాదు..సింగర్ శ్రీ లత. తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటేషన్స్ లలో తన ప్రతిభను చాటింది సింగర్ శ్రీలలిత.  యంగ్ సింగర్ శ్రీలలిత బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వరనీరాజనం, సరిగమప లిటిల్ ఛాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు కాంతార పాట కూడా శ్రీలలిత పాడిందన్న విషయం తెలిసి ఆమె పేరు మరింత పాపులర్ అయిపోతుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?