ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకతో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఊపు వచ్చిందనే చెప్పాలి.
ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకతో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఊపు వచ్చిందనే చెప్పాలి. అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారి అల్లు అర్జున్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ఇది.
అల్లు కాంపౌండ్ లోని ఒక ట్రెండ్ ని అల్లు అర్జున్ కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్.. Nandamuri Balakrishna, బోయపాటి శ్రీను లతో పాటు అఖండ చిత్ర యూనిట్ కి పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అఖండ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్ ఈ పార్టీ ఏర్పాటు చేశారట.
undefined
గతంలో కూడా అల్లు అర్జున్ 'మహానటి' లాంటి చిత్రాలు విడుదలైనప్పుడు పార్టీ ఏర్పాటు చేశాడు. అఖండ చిత్రం ప్రత్యేక పరిస్థితుల్లో విడుదలై ఇండస్ట్రీకి మంచి ఊపు ఇచ్చింది. కోవిడ్ పరిస్థితులు, ఏపీలో టికెట్ ధరల సమస్యలు ఉండగా ఈ చిత్రం విడుదలై తిరుగులేని విజయం సాధించింది.
ఇదే విషయాన్ని అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ప్రస్తావించారు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్యకు పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా నందమూరి.. అల్లు కుటుంబాల మధ్య బంధం మరింతగా బలపడుతోందని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మెగా, అల్లు మధ్య కొంత గ్యాప్ ఉందనే రూమర్స్ ఎలాగు ఉన్నాయ్. ఈ నేపథ్యంలో బాలయ్య, బన్నీ కలయిక సరికొత్త చర్చకు దారి తీస్తోంది. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం మరోలా వాదిస్తున్నారు. అఖండ చిత్రం ప్రత్యేక పరిస్థితుల్లో విడుదలయింది. అలాంటి చిత్రాన్ని ప్రోమోట్ చేయడం ఇండస్ట్రీకి అవసరం అని అంటున్నారు.
Also read: 2021లో ఒక ఊపు ఊపేసిన ఐటెం సాంగ్స్ ఇవే.. 'భూమ్ బద్దల్ నుంచి 'ఊ అంటావా' వరకు