HANUMAN FIRST LOOK : 5 భాషల్లో హనుమాన్.. కుర్ర హీరో బంపర్ ఆఫర్

Published : Dec 13, 2021, 11:48 AM IST
HANUMAN FIRST LOOK : 5 భాషల్లో హనుమాన్.. కుర్ర హీరో బంపర్ ఆఫర్

సారాంశం

హనుమాన్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. తేజా సజ్జ-అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈమూవీని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. 


చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఈ మధ్యే హీరోగా మారాడు తేజ్ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ్ సజ్జా- అమృత అయ్యర్ జంటగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ హనుమాన్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. హీరోయిన్ కు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. 


హనుమాన్ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్. హనుమాన్ మూవీలో హీరోయిన్ అమృత అయ్యర్  మీనాక్షి క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందమైన సరస్సులో.. రంగురంగుల చేపలు ఎగురుతుండగా.. పడవలో షికారు చేస్తూ.. ప్రకృతి అందాలు ఆస్వాధిస్తున్న మీనాక్షి పాత్రలో.. అమృత వీడియో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. 

 

ఈ మోషన్ పోస్టర్ ను కోలీవుడ్ స్టార్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మీనాక్షి పోస్టర్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ.. హనుమాన్ 5 భాషల పోస్టర్స్ ను తన ట్విట్టర్ పేజ్ లో శేర్ చేశారు విజయ్. 

 

ప్రస్తుతం హనుమాన్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తేజా సజ్జతో  డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఇది రెండోవ సినిమా. వీరి కాంబినేషన్ లో ఇంతకు ముందు జాంబిరెడ్డి మూవీ రిలీజ్ అయ్యి.. సక్సెస్ సాధించింది. రొటీన్ సినిమాలు కాకుండా.. డిఫరెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ.. హీరోగా  తన మార్క్ చూపించుకుంటున్నాడు తేజా సజ్జ. హీరోగా కెరీర్ బిగినింగ్ లోనే పాన్ ఇండియాకు వెళ్తున్నాడు తేజ్. ఈ సినిమా పాన్ ఇండయా రేంజ్ లో పాజిటీవ్ రెస్పాస్స్ సాధిస్తే.. తేజ్ హీరోగా ఇండస్ట్రీలో ఫిక్స్ అయిపోయినట్టే. 

Also Read : Rajinikanth Birthday Special : రజనీ కాంత్ కు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా..? రజనీ సంపాదన ఎంతుంటుంది..?

 

PREV
click me!

Recommended Stories

Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?