ప్రభాస్ సినిమాకు 'మనం' పోలికలా?

Published : Dec 25, 2018, 07:03 PM IST
ప్రభాస్ సినిమాకు 'మనం' పోలికలా?

సారాంశం

టాలీవుడ్ లో ఒక రూమర్ మొదలయ్యింది అంటే దానికి స్టార్స్ ఫులిస్టాప్ పెట్టేవరకు చక్కర్లుకొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల ఊహాగానాలు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి.

టాలీవుడ్ లో ఒక రూమర్ మొదలయ్యింది అంటే దానికి స్టార్స్ ఫులిస్టాప్ పెట్టేవరకు చక్కర్లుకొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల ఊహాగానాలు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా విషయంలో మరొక రూమర్ వైరల్ అవుతోంది. 

జిల్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ ఒక లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచే కథపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఇక రీసెంట్ గా ప్రభాస్ సినిమాలో కార్లను ఇష్టపడే వ్యక్తి అని అలాగే వింటేజ్ కార్ల వ్యాపారి అంటూ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మనం సినిమా పోలికలతో కథను అల్లినట్లు కొత్త తరహా ఊహాగానాలకు తెరలేపుతున్నారు. 

కార్లను అమితంగా ఇష్టపడే ప్రభాస్ ఒక పేదింటి యువతీ ప్రేమలో పడతాడని అలాగే ప్రేమ కోసం ఏమి లేని వాడిగా ఆమె ముందే తిరుగుతాడు అన్నట్లు ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మనం లో ఒక ఎపిసోడ్ ని గుర్తు చేస్తున్న ఆ కథనే దర్శకుడు ఫుల్ ఎంటర్టైనర్ గా తెరపై ఆవిష్కరించనున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చిత్ర యూనిటే క్లారిటీ ఇవ్వాలి. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ