`పుష్ప2` అల్లు అర్జున్‌ లుక్‌ లీక్‌..? బన్నీ అమ్మోరు అవతారం.. ఫ్యాన్స్ ఊగిపోవడమే!

Published : Apr 07, 2023, 05:17 PM IST
`పుష్ప2` అల్లు అర్జున్‌ లుక్‌ లీక్‌..? బన్నీ అమ్మోరు అవతారం.. ఫ్యాన్స్ ఊగిపోవడమే!

సారాంశం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా రేపు విడుదల చేయాల్సిన కొత్త లుక్‌ విడుదలైంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.

అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప 2` సినిమా నుంచి ట్రీట్‌ వచ్చింది. మూడు నిమిషాల నిడివి గల `వేర్‌ ఈజ్‌ పుష్ప` పేరుతో ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది టీమ్‌. పుష్ప ఎనిమిది బుల్లెట్ల గాయంతో తప్పించుకున్నారని చెప్పగా, పుష్ప చనిపోయి ఉంటాడని, పోలీసులు డ్రామా చేస్తున్నారని, పుష్ప విదేశాలకు పారిపోయి ఉంటాడని మీడియాలో కథనాలు వస్తుంటాయి. ఇంతలో దొరికిన ఓ కెమెరా రికార్డింగ్‌ వీడియోలో పుష్ప కనిపించడంతో జనం సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏకంగా పుష్ప రంగంలోకి దిగి ఇది పుష్ప రూలు అంటూ చెప్పడంతో వీడియో అదిరిపోయింది. 

రేపు(ఏప్రిల్‌8)న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు ఫ్యాన్స్ కి `పుష్ప2` నుంచి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది టీమ్‌. అయితే రేపు శనివారం మరో ట్రీట్‌ ఉంటుందని భావించారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బర్త్ రోజున `పుష్ప2`లోని బన్నీ కొత్త లుక్‌ లీక్‌ అయ్యింది. ఇందులో అల్లు అర్జున్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఉండటం విశేషం. ఇందులో బన్నీ ఏకంగా అమ్మోరు అవతారంలో కనిపిస్తున్నారు. 

ముఖానికి రంగులు పూసుకుని, ముక్కు పుడక, మెడలో బత్తాయి కాయల దండ, పులదండ, నగల హారాలు ధరించి చీరకట్టుకుని కండలు తిరిగిన దేహంతో, చేతిలో తుపాకి పట్టుకుని కోపంతో కనిపిస్తున్నాడు బన్నీ. చేతులకు బంగారు గాజులు, ఉంగరాలు ధరించారు. ఇందులో ఆయన లుక్‌ పూర్తి భిన్నంగా ఉండటమే కాదు, నెవర్‌ బిఫోర్‌  అనేలా ఉండటం విశేషం. ఓ రకంగా అమ్మోరికి పూనకాలు వచ్చినట్టుగానే, ఈ లుక్‌ని చూస్తే బన్నీ ఫ్యాన్స్ కూడా ఊగిపోవడం పక్కా అని అంటున్నారు నెటిజన్లు. 

ప్రస్తుతం ఈ లీక్డ్ బన్నీ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది రేపు టీమ్‌ విడుదల చేయబోతున్న లుక్‌ అని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓ నెటిజన్‌ దీన్ని తాను ముందే ఊహించానని చెబుతూ ఈ పోస్టర్‌ని పంచుకోవడ విశేషం. దీనిపై బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా అసలు మాస్‌ అని, తెలుగులో ఏ హీరో ఇలాంటి సాహసం చేయడని అంటున్నారు. దీన్ని వైరల్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు. రేపు విడుదల చేసే పోస్టర్‌ ఇదే అయితే వెండితెరకి పూనకాలు రావాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం బన్నీ ఈ నయా లుక్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుండటం విశేషం. 

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప2` మూవీ రెండేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి కొనసాగింపు(రెండో పార్ట్). ఇందులో కూడా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ దీన్ని మరింత లావిష్‌గా రూపొందిస్తుండటం విశేషం. విలన్‌గా ఇందులో ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌