ఒక్క ఫొటోతో షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న వర్కౌట్ స్టిల్..

Published : Apr 07, 2023, 04:53 PM IST
ఒక్క ఫొటోతో షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న వర్కౌట్ స్టిల్..

సారాంశం

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  ఈక్రమంలో నెట్టింట ఓ ఫొటోను షేర్ చేయగా వైరల్ గా మారింది.  

బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఫ్యాన్స్ ముద్దుగా బాయ్ జాన్ అని కూడా పిలుచుకుంటుంటారు. హిందీ చిత్రాలతో నార్త్ ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో గెస్ట్ రోల్ తో అదరగొట్టారు. తెలుగు ఆడియెన్స్ ను ఖుషీ చేశారు.  

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ Kisi ka Bhai Kisi Ka Jaan చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  తమిళ సినిమా ‘వీరమ్‌’కు రీమేక్ ఇది. ఈ చిత్రానికి ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించగా.. హిందీలో సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు.  
సల్మాన్ ఖాన్ సరసన గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేశ్, జగపతి బాబు, భూమిక ప్రధాన పాత్రల్లో నటించారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా కామియో అపియరెన్స్ ఇవ్వనున్నారు.  

ఈనెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా నార్త్, సౌత్ తో రీచ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ కూడా సినిమాను ప్రమోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. తను జిమ్ లో  వర్కౌట్ చేస్తున్న సమయంలో ఫొటోకు ఫోజిచ్చారు. థైస్ కండరాలను చూపిస్తూ బాయ్ జాన్ తన ఫిట్ నెస్ ను చూపించారు.  57 ఏండ్ల వయస్సులోనూ సల్మాన్ కాన్ ఫిట్ గా కనిపించడంతో ఫ్యాన్స్ పొగడ్తతల వర్షం కురిపిస్తున్నారు. 

ఆ పిక్ ను కొద్ది సేపటి కింద సల్మాన్ కాన్ అభిమానులతో పంచుకుంది. దీంతో క్షణాల్లోనే లక్షల లైక్స్ తో ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. వర్కౌట్ సెషన్ నుంచి ఫొటో పంచుకుంటూ ఏప్రిల్ 21న చిత్రం విడుదల కానుందంటూ అభిమానులకు సూచించారు.  ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఏప్రిల్ 10న చిత్ర ట్రైలర్ కూడా విడుదల కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?