
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే పుష్ప ది రూల్ రిలీజ్ చేసే దిశగా సుక్కు అండ్ టీం వర్క్ చేస్తున్నారు. పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెట్ చేసిన క్రేజ్ ని అంతా ఇంతా కాదు. దీనితో పుష్ప ది రూల్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
పుష్ప 2పై హైప్ పెంచే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వేరీజ్ పుష్ప అంటూ ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన చిన్న బైట్ ఇండియా మొత్తం ట్రెండ్ అయింది. అయితే దీని గురించి పూర్తి స్థాయి అప్డేట్ కొద్దీ సేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన 41వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ బర్త్ డే కానుకగా సుకుమార్ మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇచ్చారు.
వేరీజ్ పుష్ప అంటూ మొదలు పెట్టిన సుకుమార్.. అల్లు అర్జున్ బర్త్ టీజర్ లో పుష్ప 2 స్టోరీకి సంబంధించిన థీమ్ ఏంటో రివీల్ చేశారు. తిరుపతి జైలు నుంచి 8 బులెట్ గాయాలతో పుష్ప తప్పించుకుంటాడు. ఈ క్రమంలో పుష్ప అసలు బతికే ఉన్నాడా.. బ్రతికుంటే అక్కడ ఉన్నాడు అనే అనుమానాలు. పుష్ప కేవలం స్మగ్లర్ మాత్రమే కాదు. లక్షలాది మందికి జనాలకు దేవుడు.
స్మగ్లింగ్ తో దోచుకున్న దొమ్ముని ప్రజల బాగు కోసమే పంచుతుంటాడు. దీనితో పుష్ప ప్రజల్లో దేవుడిగా మారుతాడు. పుష్ప చనిపోయాడనే అనుమానాలు రావడంతో ప్రజల్లో పోలీసులకు వ్యతిరేకంగా నిరసన జ్వాల చెలరేగుతుంది. ప్రజల్లో పోలీసుల్లో గందరగోళం నెలకొని ఉండగా.. శేషాచలం అడవుల్లో నైట్ విజన్ కెమెరాలో ఒక దృశ్యం చిక్కుతుంది.
ఆ వీడియోలో పులి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. దానికి ఎదురుగా బెడ్ షీట్ కప్పుకుని ఒక వ్యక్తి వస్తాడు. అతడిని చూడగానే పులి రెండడుగులు వెనక్కి వేస్తుంది. 'అడవిలో జంతువు రెండడుగులు వెనక్కి వేస్తే పులి వచ్చింది అని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం' అనే డైలాగ్ తో అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. నైట్ విజన్ లో బన్నీ కళ్ళు కూడా పులి కళ్లలా ఉంటాయి.
దీనితో పుష్ప బ్రతికే ఉన్నాడని కంఫర్మ్ అంవుతుంది. ప్రజల్లో సంబరాలు షురూ అవుతాయి. చివర్లో అల్లు అర్జున్ కుర్చీలో కూర్చుని 'ఇది పుష్ప గాడి రూల్' అని చెప్పడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.