వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని ప్రారంభించిన రియల్‌ హీరో సోనూ సూద్‌

Published : Apr 07, 2021, 02:22 PM IST
వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని ప్రారంభించిన రియల్‌ హీరో సోనూ సూద్‌

సారాంశం

కరోనా రియల్‌ హీరో సోనూ సూద్‌ మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంతేకాదు వ్యాక్సిన్‌ ప్రాధాన్యతని వివరిస్తూ సంజీవని అనే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని ప్రారంభించారు.  

కరోనా రియల్‌ హీరో సోనూ సూద్‌ మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంతేకాదు వ్యాక్సిన్‌ ప్రాధాన్యతని వివరిస్తూ సంజీవని అనే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా, ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేలా ఈ డ్రైవ్‌ని ఉంటుందన్నారు. ఈసందర్భంగా సోనూ సూద్‌ మాట్లాడారు. 

`కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అందుకే ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ని ప్రారంబిస్తున్నాం. కొంతమంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోని వృద్దులు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ చాలా ఉపయోగపడుతుంద`ని సోనూసూద్ తెలిపారు.

పంజాబ్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ వ్యాక్షిన్ ను అందచేయబోతున్నాం. గ్రామీణ ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆలోచిస్తున్నారు. కావున ఈరోజు అందరి ముందు వ్యాక్షిన్ వేయించుకోవడం జరిగింద`ని సోనూసూద్ తెలిపారు. త్వరలో పలు ఏరియాల్లో వ్యాక్సిన్ క్యాంపులు ప్రారంభిస్తున్నానని ఆయన అన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?
దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?