Allu Arjun : ఫాదర్స్ డే.. బన్నీ ఎమోషనల్ పోస్ట్.. తండ్రి అల్లు అరవింద్ కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్..

By Asianet News  |  First Published Jun 18, 2023, 10:55 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  ఫాదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తండ్రి అల్లు అరవింద్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పోస్ట్ వైరల్ గా మారింది.
 


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెరగని ముద్ర వేసుకున్నారు. 20 ఏళ్లలో అంతకంతకూ ఎదుగుతూ వస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి హీరోగా నిలిచారు. అయితే బన్నీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపస్తుంటారు. ముఖ్యంగా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం తనదైన శైలిలో స్పందిస్తుంటారు. 

ఈరోజు ఫాదర్స్ డే కావడంతో బన్నీ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తండ్రి అల్లు అరవింద్ తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఫాదర్స్  డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ నోట్ రాశారు. ‘ప్రపంచంలో ఉన్న తండ్రులు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్ అయిన మీకూ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను‘ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రత్యేకమైన రోజున తండ్రిపై అల్లు అర్జున్ చూపించిన ప్రేమకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

ఈనెల 15న అల్లు అర్జున్ AAA సత్యం మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రాండ్ గా ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగాయి. అల్లు అర్జున్ హాజరై ప్రారంభించారు. ఐకాన్ స్టార్ రాకతో అమీర్ పేట మొత్తం అభిమానులతో సందడిగా మారింది.  ఇక అల్లు అరవింద్ కూడా బన్నీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో, ముఖ్యంగా బన్నీ పిల్లలతో సమయం గుడుపుతుంటారు. 

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రీసెంట్ గానే మేజర్ షెడ్యూల్ ను మారేడుమిల్లిలో పూర్తి చేసుకున్నారు. త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

click me!