మేనేజర్ చేతిలో మోసపోయిన ర‌ష్మిక? పెద్ద మొత్తానికే ఎసరు?

Published : Jun 18, 2023, 10:42 AM IST
మేనేజర్ చేతిలో మోసపోయిన ర‌ష్మిక? పెద్ద మొత్తానికే ఎసరు?

సారాంశం

   ర‌ష్మిక ద‌గ్గ‌ర చాలా కాలంగా ప‌ని చేస్తున్న ఆ మేనేజ‌ర్.. ఆమెను దారుణంగా మోసం చేసిన‌ట్లు స‌మాచారం. దాదాపు ...


సినిమా పరిశ్రమలో మేనేజర్లు మీద నమ్మకంతోనే హీరో, హీరోయిన్స్ ముందుకు వెళ్తూంటారు. వారి కెరీర్ ని  ముందుకు తీసుకెళ్లాలన్నా, తొక్కేయాలన్నా వీరి కృషే ఎక్కువ ఉంటుంది. అయితే మేనేజర్స్ కు కమీషన్ బేసిస్ మీద పారితోషికం ఉంటుంది కాబట్టి తమ హీరో లేదా హీరోయిన్ ఎదుగుదల కోసం కృషి చేస్తూంటారు. మరీ ముఖ్యంగా ప‌ర భాషా హీరోయిన్లు తెలుగు సినిమాల్లోకి అడుగు పెడితే.. వాళ్ల‌కు ఇక్క‌డ అన్నీ చూసుకునేది మేనేజ‌ర్లే. 

అయితే కొద్ది దూరం వెళ్లాక అనేక విషయాలలో పొరపొచ్చాలు వచ్చి విభేధాలతో విడిపోయిన వారు ఉన్నారు. రీసెంట్ గా సాయి థరమ్ తేజ తన కెరీర్ ప్రారంభం నుంచి ఉంటున్న మేనేజర్ ని ప్రక్కన పెట్టారనే వార్త వినే ఉంటారు. ఇప్పుడు రష్మిక కూడా అదే పరిస్దితి ఎదుర్కొందని సమాచారం.

అతి తక్కువ కాలంలో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక. అందరు స్టార్స్ కు ఈ హీరోయిన్ ఫస్ట్ ఛాయస్ గా  మారిపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పుష్ప సినిమాతో పాటు  వరస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె మేనేజరు కూడా మంచి ఆదాయమే ఉంది. అయితే   ర‌ష్మిక ద‌గ్గ‌ర చాలా కాలంగా ప‌ని చేస్తున్న ఆ మేనేజ‌ర్.. ఆమెను దారుణంగా మోసం చేసిన‌ట్లు స‌మాచారం. దాదాపు రూ.80 ల‌క్ష‌ల మేర అత‌ను ఫ్రాడ్ చేశాడ‌ని వార్తలు వస్తున్నాయి. త‌ను త‌న‌ను మోసం చేసి, భారీగా డ‌బ్బులు తిన్న విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న ర‌ష్మిక వెంట‌నే అత‌ణ్ని తొల‌గించిన‌ట్లు తెలిసింది. 

క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీ అనే సూప‌ర్ హిట్ మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయిన ర‌ష్మిక‌కు తెలుగులో అడుగు  పెట్టాకే స్టార్ ఇమేజ్ వ‌చ్చింది. ఇక్క‌డ ఆమె ఛ‌లో, గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ‌.. ఇలా హిట్ల మీద హిట్లు కొట్టి పెద్ద హీరోయిన్ అయింది. ఈ క్రమంలో  పేరున్న మేనేజ‌ర్‌కు త‌న డేట్లు, ఇత‌ర వ్య‌వ‌హారాలు చూసేందుకు నియ‌మించుకుంది. అతనే ఇలా మేసం చేస్తాడని ఊహించలేదట.

ఇక ప్ర‌స్తుతం ర‌ష్మిక  వరస పెట్టి చాలా  భాష‌ల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె న‌టిస్తున్న క్రేజీ మూవీ పుష్ప‌-2 మీద భారీ అంచ‌నాలే ఉన్నాయి. దీంతో పాటు భీష్మ త‌ర్వాత మ‌ళ్లీ నితిన్, వెంకీ కుడుముల‌తో క‌లిసి ఓ సినిమాలోనూ న‌టిస్తోంది ర‌ష్మిక‌. హిందీలో అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి డైరెక్ష‌న్లో రణ‌బీర్ క‌పూర్‌తో చేస్తున్న యానిమ‌ల్ మ‌రో క్రేజీ ప్రాజెక్టు. ఇది కాక తెలుగు, త‌మిళ భాష‌ల్లో రెయిన్‌బో అనే సినిమాలోనూ ర‌ష్మిక న‌టిస్తోంది.  

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?