డీజే తొలి వారం వందకోట్లు: అధికారికంగా ప్రకటించిన నిర్మాత

Published : Jun 30, 2017, 03:26 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
డీజే తొలి వారం వందకోట్లు: అధికారికంగా ప్రకటించిన నిర్మాత

సారాంశం

తొలి వారం వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన డీజే దువ్వాడ జగన్నాథం డీజే మూవీకి డివైడ్ టాక్ వచ్చినా వరుస సెలవులతో కలెక్షన్ల సునామీ పక్కా కమర్షియల్ మూవీస్ చేస్తున్న అల్లు అర్జున్ కు వరుస విజయాలు

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన డీజే కలెక్షన్స్ రికార్డ్ సృష్టిస్తోంది. స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కి వరుసగా హిట్ కొట్టడం అలవాటుగా మారిపోయింది. ఇక్కడ విశఏషమేంటంటే ఇటీవల బన్నీ హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ డివైడ్ టాక్ తోనే మొదలయ్యాయి. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న బన్నీ, ప్రతి సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్ల విషయంలో బన్నీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన డీజే దువ్వాడ జగన్నాథమ్ కూడా డివైడ్ టాక్ తో మొదలైన కలెక్షన్ల సునామీ సృష్టించింది.

తొలి వారంలోనే ఏకంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి డీజే రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లలో ఒక వారంలో 100 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అఫిషియల్ గా ప్రకటించారు. అంతేకాదు దర్శకుడు హరీష్ శంకర్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. 'వంద కోట్ల సినిమా ఇచ్చిన సభ్య సమాజానికి శతకోటి వందనాలు, కలెక్షన్ల పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా'మని ట్వీట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

Niharika: చిరంజీవి డ్రీమ్ ని ఫుల్‌ ఫిల్‌ చేసిన నిహారికా.. ఏం చేసిందంటే
400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే