టబు పెళ్లి చేసుకోపోవటానికి కారణం అతడేనట

Published : Jun 29, 2017, 10:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టబు పెళ్లి చేసుకోపోవటానికి కారణం అతడేనట

సారాంశం

పెళ్లి చేసుకోపోవటానికి కారణం వెల్లడించిన టబు గతంలో అజయ్ దేవ్ గన్ తనను ఇష్టపడేవాడంటున్న టబు తననెవరైనా చూస్తే అజయ్ దాడి వల్లే ఎవరూ చేసుకోలేదన్న టబు

నైంటీస్ లో టబు అంటే తెలుగు సినిమా రంగంలో ఓ హాట్ టాపిక్. అప్పట్లో 'నిన్నే పెళ్లాడతా' సినిమాలో నాగార్జున సరసన హాట్ హాట్ గా నటించిన టబు,నాగార్జున హాట్ ఫేవరెట్ అయిపోయారు. అప్పట్లో వీరి మధ్య ఎఫైర్ కూడా ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ 45 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి దూరంగా ఉన్న ఈ ప్రౌడ సుందరి తాజాగా తనకు పెళ్లి కాక పోవడానికి కారణం మరొకరు వున్నారంటూ ఓ కొత్త విషయం బయట పెట్టేసింది.

తనకు పెళ్లి కాక పోవడానికి, ఇప్పటికీ సింగిల్‌గా మిగిలిపోవడానికి కారణం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అని టబు అంటోంది. దాదాపు 25 సంవత్సరాలుగా అజయ్ దేవగన్ తనకు తెలుసని, ఒకప్పుడు తన కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడని, తామంతా అప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారమని, ఆ సమయంలో అజయ్ తనను ఫాలో అయ్యేవాడని టబు అంది. అప్పట్లో నాతో వేరే అబ్బాయిలు మాట్లాడితే దాడి చేసేవాడని అంది. తాను ఎక్కడికి వెళ్లినా అజయ్ ఫాలో అయ్యేవాడని, వేరే అబ్బాయిలు ఎవరైనా తన వైపు చూసినా, మాట్లాడినా.. వారిపై దాడి చేసి వార్నింగ్ ఇచ్చేవాడని టబు చెప్పింది.

అప్పట్లో అజయ్ ప్రవర్తన ఇతర అబ్బాయిలు నాతో మాట్లాడటానికి, నన్ను ప్రేమించడానికి భయపడేవారు. నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ముమ్మాటికీ అజయ్. నాకో అబ్బాయిని చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత అతడితే అని టబు అంటోంది. అజయ్ దేవగన్‌తో తనది చాలా స్పెషల్ రిలేషన్ అని, ఎంతో గౌరవం ఇస్తాడని, చాలా బాగా ట్రీట్ చేస్తాడని, అజయ్ అంటే తనకు కూడా ఇప్పటికీ ఇష్టమే.. అంటూ టబు వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం అజయ్ దేవగన్, టబు కలిసి ‘గోల్‌మాల్ ఎగేన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పరిణీతి చోప్రా కూడా నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా టబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి అప్పట్లో ఓ తెలుగు హీరోతో చెట్టాపట్టాలంటూ వచ్చిన రూమర్స్ గురించి ఏమంటుందో.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు