చిరంజీవి ఎపిక్ సినిమా చేస్తారనుకుంటే.. ఆయన మాత్రం: బన్నీ కామెంట్స్!

Published : Aug 22, 2018, 12:16 PM ISTUpdated : Sep 09, 2018, 11:49 AM IST
చిరంజీవి ఎపిక్ సినిమా చేస్తారనుకుంటే.. ఆయన మాత్రం: బన్నీ కామెంట్స్!

సారాంశం

ఠాగూర్ సినిమా నుండి చిరంజీవి గారిని ఎపిక్ సినిమాలో చూడాలనేది నా కోరిక. చిరంజీవి గారు పదేళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తున్నారని తెలిసి ఆయన చేసేది ఓ ఎపిక్ ఫిలిం అని అనుకున్నాను. కానీ ఖైదీ నెంబర్ 150 చేశారు. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నారు.. ఇది ఎపిక్ కాదు కదా అనుకున్నాను.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150','సై రా' సినిమాలను కంపేర్ చేస్తూ.. ''ఠాగూర్ సినిమా నుండి చిరంజీవి గారిని ఎపిక్ సినిమాలో చూడాలనేది నా కోరిక. చిరంజీవి గారు పదేళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తున్నారని తెలిసి ఆయన చేసేది ఓ ఎపిక్ ఫిలిం అని అనుకున్నాను.

కానీ ఖైదీ నెంబర్ 150 చేశారు. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నారు.. ఇది ఎపిక్ కాదు కదా అనుకున్నాను. అది పక్కా మాస్ సినిమా. ఫ్యాన్స్ కి ఏంకావాలో వాటిని 150వ సినిమా ద్వారా అందించారు. ఇక 'సైరా' మాత్రం నా కలను నెరవేరుస్తుంది. చరణ్ నిర్మాతగా భారీ స్కేల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తండ్రికి కొడుకు ఇస్తోన్న గిఫ్ట్ ఇది'' అంటూ వెల్లడించారు. ఇక రామ్ చరణ్ ఈ సినిమా బడ్జెట్ ఎంతనేది చెప్పకపోయినప్పటికీ బన్నీ మాత్రం ఆ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

'ఖైదీ నెంబర్ 150' సినిమా ఎంత వసూలు చేసిందో దానికి రెట్టింపు బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారని బన్నీ అన్నాడు. ప్రస్తుతానికి బన్నీ తన తదుపరి సినిమా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్రివిక్రమ్ కోసం ఎదురుచూస్తున్నాడని, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇలా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

మెగాస్టార్ కి ప్రముఖుల బర్త్ డే విషెస్!

'సై రా' టీజర్ చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు స్పెషల్..

PREV
click me!

Recommended Stories

Jana Nayakudu Trailer: `భగవంత్‌ కేసరి`ని మక్కీకి మక్కీ దించేసిన విజయ్‌.. కొత్తగా చూపించింది ఇదే.. వాళ్లకి వార్నింగ్‌
Sreemukhi: అక్కా తనూజ, కళ్యాణ్‌ని కలపండి.. శ్రీముఖికి నెటిజన్ల క్రేజీ రిక్వెస్ట్ లు.. డోస్‌ తగ్గించడంపై ఆందోళన