పవన్ అలా చేసేసరికి ఏడుపొచ్చేసింది.. తనతో గొడవ పడ్డా: సుప్రియ

Published : Aug 22, 2018, 11:46 AM ISTUpdated : Sep 09, 2018, 01:03 PM IST
పవన్ అలా చేసేసరికి ఏడుపొచ్చేసింది.. తనతో గొడవ పడ్డా: సుప్రియ

సారాంశం

పవన్ కళ్యాణ్ ఎంతమంది హీరోయిన్లతో కలిసి పని చేసినా.. సుప్రియ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మొదటి హీరోయిన్.. ఇద్దరూ ఒకే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు

పవన్ కళ్యాణ్ ఎంతమంది హీరోయిన్లతో కలిసి పని చేసినా.. సుప్రియ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మొదటి హీరోయిన్.. ఇద్దరూ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'  సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అటువంటి సుప్రియ పవన్ గురించి ఏం చెప్పినా.. అభిమానులకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం కామన్. రీసెంట్ గా ఓ షోలో పాల్గొన్న సుప్రియ తన మొదటి సినిమాతో పవన్ తో కలిసి నటించడం, అతడి ప్రవర్తన వంటి విషయాలపై కామెంట్స్ చేసింది.

పవన్ చేసిన పనికి ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ''పవన్ కళ్యాణ్ తెగ సిఇగుపడిపోతూ ఉండేవారు. ఆయన జెంటిల్మెన్. సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతోంది. దీంతో టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేవారు. మొదటి సినిమా కావడంతో పవన్ చాలా టెన్షన్ తీసుకునేవారు. నాకు మాత్రం ఏం అనిపించేది కాదు. అప్పట్లో హీరోలకు నొసలవరకు జుట్టు ఉండేది. పెద్ద మీసం.. కళ్లజోడు కూడా పెట్టేవారు. వారికి క్లోజప్ పెట్టి ఎక్స్ ప్రెషన్ అడుగుతారు. అసలు ఏం కనపడుతుంది.. హీరో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ పెట్టాడో తెలియక.. నాలుగైదు టేకులు తీసుకునేదాన్ని.

ఏఎన్నార్ గారి మనవరాలు నాలుగు టేకులా అన్నట్లు చూసేవారు. దీంతో నాకు కోపం వచ్చి పవన్ దగ్గరకి వెళ్లి నువ్వు కళ్లజోడు తీసి నటించు అని సరదాగా గొడవలు పడేదాన్ని. సినిమా షూటింగ్ లో ఆయన తన చేతులపై కార్లు ఎక్కించుకొని, ఛాతీపై రాళ్లు పగలగొట్టించుకొని శ్రమ తీసుకున్నారు. మొదట డూప్ ని పెడతారేమో అనుకున్నాను. కానీ పవన్ నిజంగానే కార్లు చేతిపై ఎక్కించుకోవడం చూసి నాకు ఏడుపు ఆగలేదు. ఏం జరుగుతుందో అర్ధంకానీ స్థితిలో ఉండిపోయాను'' అంటూ చెప్పుకొచ్చింది.   

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ