Mahesh rejected Pushpa: 'పుష్ప'ని మహేష్ రిజెక్ట్ చేయలేదా.. ఆ భయంతో, అసలేం జరిగింది!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 19, 2021, 12:33 PM IST
Mahesh rejected Pushpa: 'పుష్ప'ని మహేష్ రిజెక్ట్ చేయలేదా.. ఆ భయంతో, అసలేం జరిగింది!

సారాంశం

రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్.. సూపర్ స్టార్ Mahesh Babu తో సినిమా చేయాలనుకున్నాడు. ఇది వాస్తవం. ఇద్దరి కాంబోలో చిత్రానికి ప్రకటన కూడా వచ్చింది.   

బన్నీ, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో లేనప్పటికీ Allu Arjun తన నటనతో అదరగొట్టాడు. టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా పుష్ప చిత్రంపై అనేక ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. రంగస్థలం లాంటి నాన్ బాహుబలి రికార్డ్ విజయం తర్వాత సుకుమార్ ఎంచుకున్న కథ పుష్ప. రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్.. సూపర్ స్టార్ Mahesh Babu తో సినిమా చేయాలనుకున్నాడు. ఇది వాస్తవం. ఇద్దరి కాంబోలో చిత్రానికి ప్రకటన కూడా వచ్చింది. 

కానీ సుకుమార్ మహేష్ బాబుతో చేయాలనుకుంది పుష్ప చిత్రమేనా అనేది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మహేష్ బాబు సుకుమార్ వినిపించిన పుష్ప కథని రిజెక్ట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అనేక వాదనలు ఉన్నాయి. రంగస్థలం తర్వాత సుక్కు పుష్ప కథతో మహేష్ వద్దకు వెళ్లారట. సుక్కుతో సినిమా అనగానే మహేష్ కూడా ఎగ్జైట్ అయ్యాడు. 

వీరిద్దరి కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ టేకింగ్ పరంగా దీనిని క్లాసిక్ మూవీగా అభివర్ణిస్తుంటారు ఫ్యాన్స్. ఆ చిత్రంలో మహేష్ కొన్ని సన్నివేశాల్లో మానసిక వేదనకు గురయ్యే వ్యక్తిగా నటించాడు. ఆ సీన్లు కొంచెం మహేష్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించాయి. కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశాయి. 

పుష్ప చిత్రంలో బన్నీ లుక్ రస్టిక్ గా ఉంటుంది. మహేష్ కు పుష్ప కథ నచ్చినప్పటికీ గత అనుభవం దృష్ట్యా కాస్త బయపడ్డట్లు టాక్. ఈ రోల్ లో నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. కథలో మార్పులు చేయాలని సూచించారట. కథలో మార్పులు చేస్తే నేననుకున్న కంటెంట్ మిస్ అవుతుంది అని సుక్కు చెప్పాడట. తన రోల్ లో ఛేంజెస్ లేకుండా చేయడం కష్టం అని మహేష్ చెప్పడంతో సుకుమార్ అసంతృప్తితో బయటకు వచ్చేసినట్లు చెబుతున్నారు. అప్పుడే మహేష్ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సుకుమార్ తో సినిమా చేయడం లేదని ట్వీట్ కూడా చేశాడు. అదే కథతో సుక్కు అల్లు అర్జున్ ని ఒప్పించి పుష్ప చిత్రం తెరకెక్కించారు. 

Also Read: Shyam Singha Roy: మలయాళీ పిల్ల మ్యాజిక్ అందాలు.. జస్ట్ అమేజింగ్

Also Read: Pushpa Movie: 'పుష్ప' ఆఫర్ వచ్చినప్పుడు చేయనని చెప్పేశా.. 'రంగస్థలం' నటుడి షాకింగ్ కామెంట్స్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా