ప్రభాస్ సినిమాలో పాకిస్తానీ హీరోయిన్.. ఆసక్తి పెంచుతున్న రూమర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో  చిత్రం ఇటీవల ప్రారంభం అయింది. బ్రిటిష్ ఎరాలో 1940 సంవత్సార కాలంలో జరిగే ఫిక్షనల్ కథని హను రాఘవపూడి రాసుకున్నారు.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో  చిత్రం ఇటీవల ప్రారంభం అయింది. బ్రిటిష్ ఎరాలో 1940 సంవత్సార కాలంలో జరిగే ఫిక్షనల్ కథని హను రాఘవపూడి రాసుకున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే సైనికుడిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపిస్తాడు. 

ఎవ్వరూ ఊహించని విధంగా సోషల్ మీడియాలో రీల్స్ తో, డ్యాన్స్ తో పాపులర్ అయిన ఇమాన్విని హను రాఘవపూడి ప్రభాస్ కి హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఆమె ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టించాయి. 

Latest Videos

అయితే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందని ప్రచారం మొదలయింది. సెకండ్ హీరోయిన్ గా హను రాఘవపూడి పాకిస్తానీ బ్యూటీ సాజల్ అలీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

కథలో భాగంగా సాజల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూనే చాలా బలమైన పాత్రలో కనిపిస్తుందట. సాజల్ గతంలో శ్రీదేవి మామ్ చిత్రంలో నటించింది. ప్రభాస్ సినిమాలో ఆమె నిజంగా నటిస్తే జాక్ పాట్ కొట్టేసినట్లే. 

click me!