థమన్ ను పక్కన పెట్టిన బాలయ్య, లైన్ లోకి మళ్ళీ దేవిశ్రీ

Published : Jun 12, 2023, 10:04 AM IST
థమన్ ను పక్కన పెట్టిన బాలయ్య, లైన్ లోకి మళ్ళీ దేవిశ్రీ

సారాంశం

బాలయ్యకు వరుసగా రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ముచ్చటగా మూడోసారికూడా తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. వీకి కాంబోలో హ్యాట్రికహిట్ పక్కా అంటున్నారు సినీ జనాలు. ఇక సడెన్ గా ఎందుకో థమన్ నుబాలయ్య పక్కకుపెట్టేశాడు. 

సినిమాకు సంగీతం ప్రాణం లాంటిది. పాటలు ఉన్నా లేకున్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా ఉంటేనే.. ఆసినిమా ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తుంది. సినిమా విజయంలో అతని పాత్ర కూడా కీలకమనే చెప్పాలి. ఇక ఈక్రమంలో మన టాలీవుడ్ లో ఏ ప్రాజెక్ట్ చూసిన ప్రస్తుతం  థమన్ పేరే కనిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా సంగీతం అందిస్తూ తెగ బిజీగా గడుపుతున్నాడు. 

ఇక మరీ ముఖ్యంగా ఊరమాస్ సినిమాలతో అలరించే బాలయ్య కు  థమన్ ఇచ్చే సంగీతం వేరే లెవల్ లో ఉంటుంది. ప్రేక్షకులను సీట్లో కూర్చోనివ్వకుండా.. గూజ్ బాంబ్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఆ విషయంలో  అఖండ  సినిమాను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆసినిమాకు తమన్ కష్టాన్ని చూసి.. వెంటనే తన  వీరసింహా రెడ్డి సినిమాలకు బాలయ్య  అవకాశం ఇచ్చాడు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్లకు తమన్  ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించడంతో.. ముచ్చటగా బాలయ్యకు మూడో సినిమా చేస్తున్నాడు థమన్. 

అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరి సినిమాకు కూడా ఏరి కోరి తమన్ నుపెట్టుకున్నాడు బాలయ్య. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా తన 109 మూవీని ప్రకటించాడు బాలయ్య. మెగా డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈమూవీ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది.  అయితే  ఇలా బాబీతో చేయబోయే సినిమాకు మాత్రం తమన్ ను పక్కన పెట్టారట మేకర్స్. బాలయ్య కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ అయినట్టు తలుస్తోంది. 

 ఈ సారి బాబీ, బాలయ్య సినిమా కోసం..  దేవి శ్రీ ప్రసాద్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఇక వాల్తేరు వీరయ్యకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని బాబీ.. దేవి శ్రీ ప్రసాద్ పేరును కన్సిడర్ చేసినట్లు టాక్. బాలయ్య కూడా వెంటనే ఒకే చెప్పాడట. పైగా ఇప్పుడు థమన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగానే పెద్ద సినిమాలున్నాయి. దాంతో ఈ సినిమా చేయడానికి కాస్త ఎక్కువే టైమ్ పడుతుంది. దాంతో అన్ని కారణాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్