Bheemla Nayak Postpone: భీమ్లా నాయక్ కోసం దిల్ రాజు త్యాగం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 21, 2021, 10:53 AM IST
Bheemla Nayak Postpone: భీమ్లా నాయక్ కోసం దిల్ రాజు త్యాగం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

సారాంశం

భీమ్లా నాయక్ చిత్రం వాయిదా పడేలా పవన్ ని, నిర్మాతని ఒప్పించాలని ముందు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు దిల్ రాజు లీడ్ లో ఆ ప్రయత్నాలు ఫలించాయి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సంక్రాంతికి జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా భీమ్లానాయక్ రిలీజ్ వాయిదా పడింది. ఇది పవన్ అభిమానులకు తీవ్ర నిరాశ కల్గించే వార్తే. 

మూడు భారీ చిత్రాలు సంక్రాంతికి పోటీ పడితే వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనితో భీమ్లా నాయక్ చిత్రం వాయిదా పడేలా పవన్ ని, నిర్మాతని ఒప్పించాలని ముందు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు దిల్ రాజు లీడ్ లో ఆ ప్రయత్నాలు ఫలించాయి. పవన్ ని, భీమ్లా నాయక్ నిర్మాతని రిక్వస్ట్ చేసి ఒప్పించినట్లు దిల్ రాజు కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో ప్రకటించారు. 

దిల్ రాజు సారధ్యంలో ప్రొడ్యూసర్ గిల్డ్ భీమ్లా నాయక్ నిర్మాత, పవన్, త్రివిక్రమ్ లతో చర్చలు జరిపారు. దీనితో ఈ చిత్రాన్ని వాయిదా వేసేందుకు వారు అంగీకరించారు. భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలవుతుందని దిల్ రాజు ప్రకటించడం విశేషం. 

దిల్ రాజు మాట్లాడుతూ.. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలు. రెండు మూడేళ్ళ నుంచి ఈ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పోస్ట్ ఫోన్ చేయలేని పరిస్థితి. అందుకే భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేయాలని రిక్వస్ట్ చేశాం. పవన్ కళ్యాణ్ గారు, నిర్మాత చినబాబు, నాగవంశీ సానుకూలంగా స్పందించి అంగీకరించారు. అందుకు వారికి కృతజ్ఞతలు. 

భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలయ్యేలా నిర్ణయం తీసుకున్నాం. ఆ తేదీన మా ఎఫ్ 3 చిత్రం రిలీజ్ అనుకున్నాం. కానీ భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి నుంచి తప్పుకుంది కాబట్టి ఆ తేదీని వాళ్లకు ఇచ్చాం. ఎఫ్ 3 చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తాం అని దిల్ రాజు ప్రకటించారు. ఈ సందర్భంగా వాయిదాకు అంగీకరించిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, భీమ్లా నాయక్ నిర్మాతలకు ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య కృతజ్ఞతలు తెలిపారు. 

Also Read: బ్రేకింగ్ : సంక్రాంతి రేస్ నుంచి 'భీమ్లా నాయక్' అవుట్.. రిలీజ్ వాయిదా

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?