బ్రేకింగ్ : సంక్రాంతి రేస్ నుంచి 'భీమ్లా నాయక్' అవుట్.. రిలీజ్ వాయిదా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 21, 2021, 09:46 AM ISTUpdated : Dec 21, 2021, 10:07 AM IST
బ్రేకింగ్ : సంక్రాంతి రేస్ నుంచి 'భీమ్లా నాయక్' అవుట్.. రిలీజ్ వాయిదా

సారాంశం

అనూహ్యంగా భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. దిల్ రాజు సారధ్యంలో జరిగిన చర్చలు ఫలించడంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేసేందుకు భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంగీకరించారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పార్లల్ గా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముందు నుంచి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తారని నిర్మాత గట్టిగా చెబుతూ వచ్చారు. 

కానీ అనూహ్యంగా భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. దిల్ రాజు సారధ్యంలో జరిగిన చర్చలు ఫలించడంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేసేందుకు భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంగీకరించారు. 

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇక భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి రేస్ లో నిలవడంతో ఫైట్ టైట్ గా మారింది. దీనితో మూడు చిత్రాల వసూళ్లపై ప్రభావం పడుతుందనే వాదన వినిపించింది. కానీ భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ మాత్రం జనవరి 12నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి గట్టిగా నిర్ణయించుకున్నారు. 

దీనితో ఆర్ఆర్ఆర్ మేకర్స్ రాజమౌళి, దానయ్య.. పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రంగంలోకి దిగి భీమ్లా నాయక్ నిర్మాత నాగవంశీతో చర్చలు  జరిపారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి కి వాయిదా వేసేలా ఒప్పించారు. దీనితో పవన్ అభిమానులకు నిరాశ తప్పలేదు. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

భీమ్లా నాయక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందించిన పాటలు పవన్ అభిమానులని ఉర్రూతలూగించే విధంగా ఉన్నాయి. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 

Also Read: Shriya Saran: అమేజింగ్ ఫోటోస్.. అందాల దేవతలా శ్రీయ కనువిందు.. హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్