Allu Arjun: అల్లు అర్జున్ ని లాక్కొచ్చిన అరవింద్,ప్లాన్ అదిరింది

Surya Prakash   | Asianet News
Published : Jan 01, 2022, 08:29 AM IST
Allu Arjun: అల్లు అర్జున్ ని లాక్కొచ్చిన అరవింద్,ప్లాన్ అదిరింది

సారాంశం

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా బాక్సాఫీస్‌ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతుంది. టాలీవుడ్‌లో రూ. 100కోట్లకు పైగా కలక్షన్లు సాధించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.  

రీసెంట్ గా పుష్ప సినిమాతో పెద్ద హిట్ ని అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సొంత ఓటిటి సంస్థ కోసం ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ స్టైలిష్ స్టార్. సినిమాపురం అనే పేరుతో ప్రతి శుక్రవారం కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయింది ఆహా. దీని ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు.కాగా తాజాగా అందుకు సంబంధించిన ఆహా పురం ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసే సినిమాలను ప్రతి శుక్రవారం ఆహా అందిస్తుందని… ఆహాపురంలో ప్రతి శుక్రవారం, కొత్త సినిమా.. అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ఆహా .. తెలుగువారి కొత్త అలవాటు అంటూ సాగిన ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి.

 
ఇక 100 శాతం ఫ్రెష్ తెలుగు కంటెంట్ ను అందించాలనే లక్ష్యంతో డిజిటల్ రంగంలో అడుగుపెట్టింది 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్. ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు - ఒరిజినల్ వెబ్ సిరీసులు - సరికొత్త టాక్ షోలతో ప్రేక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని అందిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ - జూపల్లి రామ్ సారధ్యంలో నడుస్తున్న ఈ తెలుగు ఓటీటీ సంస్థ.. రోజు రోజుకీ తమ సబ్ స్కైబర్స్ ను పెంచుకుంటూ పొతోంది. అతి తక్కువ కాలంలోనే ఇతర ఓటీటీ వేదికలకు గట్టి పోటీనిస్తోందని చెప్పవచ్చు.

  ఇప్పుడు ఆహాను సబ్స్క్రైబ్ చేసుకున్న వీక్షకులకు ఆహా 2.0 ద్వారా ఆడియో - పిక్చర్ క్వాలిటీ పరంగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో కంటెంట్ ని అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆహా లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'లక్ష్య' 'మంచిరోజులొచ్చాయి' 'డీజే టిల్లు' 'రొమాంటిక్' 'అనుభవించు రాజా' 'పుష్పక విమానం' 'గని' వంటి ఫిక్షనల్ - నాన్ ఫిక్షనల్ చిత్రాలతో పాటు ఆహా ఒరిజినల్స్ - టాక్ షో లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. 

Also Read : Arjuna Phalguna:ఎన్టీఆర్ పై అభిమానం, జగన్ ప్రభుత్వంపై సెటైర్లు ఆదుకున్నాయా?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..