Arnold: 74 ఏళ్ల వయస్సులో భార్యకు విడాకులిచ్చిన హాలీవుడ్ హీరో..

Published : Jan 01, 2022, 07:09 AM IST
Arnold:  74 ఏళ్ల వయస్సులో భార్యకు విడాకులిచ్చిన హాలీవుడ్ హీరో..

సారాంశం

హాలీవుడ్ సీనియర్ హీరో కండలవీరుడు, అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ వయస్సులో ఆయన తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు.

హాలీవుడ్ లో కండలవీరుడు ఆర్నాల్డ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బాడీ బల్డింగ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ హీరో.. హాలీవుడ్ పై తనదైన ముద్ర వేశారు.అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాధించిన ఆర్నాల్డ్.. ఇండియాలో కూడా భారీ ఫాలోయింగ్ ను సాధించాడు. అమెరికన్ పాలిటికస్ లో కూడా ఆర్నాల్ డ్ తన మార్క్ చూపించారు. చాలాకాలం స్టేట్ గవర్నర్ గా సేవలందించారు కూడా. ఈనేపథ్యంలో 74 ఏళ్ల వయస్సులో ఈ హాలీవుడ్ స్టార్ తన భార్యకు విడాకులు ఇచ్చారు.

తన భార్య శ్రివర్ కు విడాకులిస్తున్నట్టు ప్రకటించారు ఆర్నాల్డ్ . హాలీవుడ్ సీనియర్ హీరో కండలవీరుడు, అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్. అది కూడాడ 74 ఏళ్ల వయస్సులో.. అఫీషియల్ గా విడిపోబోతున్నారు.  వీరిద్దరూ 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.  ఇంకో విషయం ఏంటీ అంటే.. దాదాపు పదేళ్ల క్రితమే వీరిద్దరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి వారు విడివిడిగానే బతుకుతున్నారు. అప్లై చేసుకున్న 10 ఏళ్ల తరువాత విడాకులు మంజూరు చేసింది కోర్టు. ఇంత టైమ పట్టడానికి కూడా ఓ కారణం ఉంది.

వీరిద్దరి పేరు మీద దాదాపుగా 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయతే వీటిని ఎలా  విభజించాలి.. ఇద్దరికి ఎలా సెటిల్ చేయాలి అన్న విషయం.. కోర్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో వీరి ఆస్తులు  సెటిల్ చేయడానికి కోర్టుకు 10 ఏళ్లు టైమ్ పట్టింది. పైగా అర్నాల్డ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.యాక్షన్ సినిమాలతో బాగా ఫేమస్ అయిన ఆర్నాల్డ్... ఆయన  ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా ఆయన బాధ్యతలను నిర్వహించారు. 2003 నుంచి 2011 వరకు గవర్నర్ గా పని చేశారు. ఇప్పటికీ తన సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఆర్నాల్డ్. రీసెంట్ గా క్రిస్ మస్ పండుగ సందర్భంగా ఇళ్లు లేని పేదవారికి 25కు పైగ ఇళ్లను దానంచేశాడు ఆర్నాల్డ్.

Also Read : డీప్ ట్రబుల్ లో RRR మూవీ.. తమిళనాడులో 50% ఆక్యుపెన్సీ ఆదేశం

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే