Allu arjun:అల్లు అర్జున్ పై ఆలియా భట్ కామెంట్ , షాక్ లో ఫ్యాన్స్

Surya Prakash   | Asianet News
Published : Apr 06, 2022, 03:58 PM IST
Allu arjun:అల్లు అర్జున్ పై ఆలియా భట్  కామెంట్ , షాక్ లో ఫ్యాన్స్

సారాంశం

ఈ ఏడాది ఆలియాకు బాగా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్‌లో గంగూ బాయ్ క‌తియావాడితో హిట్ అందుకుంది. అలాగే పాన్ ఇండియా మూవీ RRRతోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. 


అలియా భట్ రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటించింది. ఆమె సినిమాలో కనిపించింది కొద్దిసేపే...మొత్తం ఎడిటింగ్ పోయిందని టాక్ వచ్చింది. అయినా ఆమె కోపం తెచ్చుకోకుండా సినిమాని ఓ రేంజిలో సోషల్ మీడియాలో పొగుడుతూ పోస్ట్ లు పెట్టింది. ఇక ఆ విషయం ప్రక్కన పెడితే తాజాగా ఆమె అల్లు అర్జున్ ..పుష్ప చిత్రం పై ఓ కామెంట్ చేసింది. అది ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏమంది?

రీసెంట్‌గా అలియా ..ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ గంగూబాయ్ క‌తియావాడి స‌క్సెస్ గురించి మాట్లాడారు. అస‌లు ముందు ఆ క్యారెక్ట‌ర్‌ను ప్రేక్ష‌కుల‌కు ఎలా క‌నెక్ట్ అయ్యేలా చేయాలో ఆలియాకు అవ‌గాహ‌న లేద‌ట‌. డైరెక్ట‌ర్ చెప్పిన స్క్రిప్ట్ బావున్నా కూడా న‌టిగా బాడీ లాంగ్వేజ్‌లో ఓ కొత్త‌దనాన్ని చూపిస్తే కానీ విజ‌యం సాధించ‌లేమని ఆలియా భ‌ట్ భావించింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న స‌మయంలో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప ది రైజ్ సినిమా విడుద‌లైంది.
 
పుష్ప ది రైజ్ సినిమా క్యారెక్ట‌ర్ డ్రివెన్ మూవీ. బ‌న్నీ బాడీ లాంగ్వేజ్ కొత్త‌గా ఉంటుంది. దాన్ని చూసిన త‌ర్వాత ఆలియా భ‌ట్ త‌న క్యారెక్ట‌ర్ కూడా మాస్‌గా ఉండాల‌ని డిఫ‌రెంట్‌గా ట్రై చేసింద‌ట‌. ఆలియా చేసిన ఆ మార్పుతో ఆమె న‌ట‌న‌లో కొత్త కోణం క‌నిపించింది. అలా ఆలియా భ‌ట్ త‌న స‌క్సెస్ సీక్రెట్‌ను రివీల్ చేసింది. పుష్ప సినిమానే త‌న హిట్ మూవీకి కార‌ణ‌మంటూ చెప్పింది ఆలియా భ‌ట్‌.

ఇక క్యారెక్ట‌ర్ డ్రివెన్ బేస్డ్ మూవీలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది ఆలియా భ‌ట్‌. ఈ ఏడాది ఆలియాకు బాగా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్‌లో గంగూ బాయ్ క‌తియావాడితో హిట్ అందుకుంది. అలాగే పాన్ ఇండియా మూవీ RRRతోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ కామెంట్ తర్వాత ఆమెకు అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ రాబోతోందంటూ రూమర్స్ మొదలయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా
Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?