Satyadev: హిట్ కోసం ‘ఫుల్ బాటిల్’ఎత్తేసాడు!

Surya Prakash   | Asianet News
Published : Apr 06, 2022, 03:19 PM ISTUpdated : Apr 06, 2022, 03:20 PM IST
Satyadev: హిట్ కోసం ‘ఫుల్ బాటిల్’ఎత్తేసాడు!

సారాంశం

 కాకినాడ పోర్టు.. ఓ ఆటో..ఓ గుడి… వీటి మ‌ధ్య ఓ తాగుబోతు.. ఇదీ స్థూలంగా క‌థ‌. క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో సాగే సినిమాలా అని తెలుస్తోంది


వైవిధ్యమైన కథలు, కొత్త స్టోరీ లైన్స్ ఉంటే కానీ ఈ తరం జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవటం కష్టంగా ఉంది. ఈ విషయం సత్యదేవ్ కు బాగా తెలుసు. నటుడుగా తానేంటో ప్రూవ్ చేసుకున్నా సత్యదేవ్ కు హీరోగా సక్సెస్ మాత్రం రావటం లేదు. దాంతో తనే నిర్మాతగా మారి ఓ కొత్త చిత్రం లాంచ్ చేసారు.  ఎస్‌డీ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించాడు. ఈ సంస్థ నుంచి ఓ కొత్త సినిమా ప్ర‌క‌టించాడు. అదే.. `ఫుల్ బాటిల్‌`. ఇందులో తానే హీరో. శ‌ర‌ణ్ కొప్పి శెట్టి దర్శ‌కుడు. ఈరోజు.. టైటిల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు.

 కాకినాడ పోర్టు.. ఓ ఆటో..ఓ గుడి… వీటి మ‌ధ్య ఓ తాగుబోతు.. ఇదీ స్థూలంగా క‌థ‌. క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో సాగే సినిమాలా అని తెలుస్తోంది. ‘కిర్రాక్ పార్టీ’తో పాటు సత్యదేవ్ హీరోగా ఇటీవల ‘తిమ్మరుసు’ చిత్రాన్ని తెరకెక్కించిన శరణ్ కొప్పిశెట్టి ‘ఫుల్ బాటిల్’కు దర్శకత్వం వహిస్తున్నాడు. రామాంజనేయులు జువ్వాజి, ఎస్.డీ. కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తొలి రెండు చిత్రాలు కన్నడ రీమేక్స్ కాగా, ఇటీవల అతను జీ 5 కోసం ‘గాలివాన’ పేరుతో ఓ వెబ్ సీరిస్ చేశాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే ‘ఫుల్ బాటిల్’ మూవీ కాకినాడ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. మరి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్న సత్యదేవ్ కు ‘ఫుల్ బాటిల్’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇక సత్యదేవ్ ప్రస్తుతం ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు కొరటాల శివ సమర్పణలోనూ తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. అలానే హిందీలో అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్న ‘రామసేతు’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?