KGF2 Second Single : ‘కేజీఎఫ్2’ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్.. ‘ఎదగరా దినకరా’ లిరికల్ వీడియో రిలీజ్..

Published : Apr 06, 2022, 03:29 PM ISTUpdated : Apr 06, 2022, 03:32 PM IST
KGF2 Second Single : ‘కేజీఎఫ్2’ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్.. ‘ఎదగరా దినకరా’ లిరికల్ వీడియో రిలీజ్..

సారాంశం

‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ మ్యూజిక్ ట్రాక్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఇటీవల మేకర్స్ ఫస్ట్  సింగిల్ ‘తుఫాన్’ ను రిలీజ్ చేయగా.. తాజాగా సెకండ్ సింగిల్ హార్ట్ టచింగ్ సాంగ్ ‘ఎదగరా దినకరా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి సైలెంట్ గా  వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కేజీఎఫ్ ఛాపర్ట్ 1’కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter 2). ఈ చిత్రం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ మేరకు మేకర్స్ కూడా కొద్ది రోజులుగా ప్రమోషన్స్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ (KGF2Trailer) కూడా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ములేపోతోంది. మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇండియా బిగ్గెస్ట్ మూవీల రికార్డులను  కూడా కొల్లగొట్టేలా కేజీఎఫ్ ఛాప్టర్ 2 మేకింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

అయితే ఈ మూవీలో యాక్షన్ తోపాటు... మదర్ సెంటిమెంట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ మేరకు కేజీఎఫ్ ఛాప్టర్ 1లో వచ్చిన మదర్ సాంగ్ ఇంకా ఆడియెన్స్ మదిలోనే ఉండిపోయింది.  ‘అమ్మ మాటిది కన్నా కాదనకు జన్మమన్నది ఒంటరి కడవరకు’ అనే  అద్భుతమైన లిరిక్స్ తో ప్రేక్షకుల గుండెలను ఎమోషన్ తో పిండేశాడు దర్శకుడు. తాజాగా  KGF Chapter 2 నుంచి అలాంటి ఎమోషనల్ సాంగ్ నే మళ్లీ రిలీజ్ చేశారు మేకర్స్. ఎవ్రీ మదర్ వాయిస్ క్యాప్షన్ తో KGF2 సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను వదిలారు. తాజాగా ‘ఎదగరా దినకరా’ అంటూ రిలీజ్ అయినా సాంగ్ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. 

ఈ సెంటిమెంట్ సాంగ్ కు తెలుగులో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సుచేత బస్రూర్ ఈ సాంగ్ ను చక్కగా పాడారు. ఇక ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ రెండో సాంగ్ ను తెలుగుతో పాటు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు. ఈ ఎమోషనల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత మంచి హార్ట్ టచింగ్ సాంగ్ ఇచ్చినందుకు మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఇక కేజీఎఫ్ పార్ట్ 2లో యష్ (Yash) మరింత వైలెంట్ గా కనిపించనున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) తో పోరాడనుండటంతో సినిమాపై హైప్ పెరిగిపోయింది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నారు. హుంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?