ఫోటోగ్రాఫర్ల పై ఆలియా భట్ అసహనం, బయటకు వెళ్లండి అంటూ ఫైర్

Published : Aug 15, 2025, 03:13 PM IST
Aliabhatt

సారాంశం

ఈమధ్య సెలబ్రిటీకు బయటకు వెళ్తే ప్రశాంతత లేకుండా పోతోంది. ఫోటోగ్రాఫర్లు, మీడియా వారు చుట్టుముట్టుతుండటంతో..ఓపిక నశించి వారిపై అసహనం వ్యాక్తం చేస్తున్నారు సినిమా స్టార్స్. తాజాగా ఆలియా భట్ కు అదే పరిస్థితి ఎదురయ్యింది.

అలియా భట్ కు కోపం వచ్చింది.

బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ తాజాగా ఫొటోగ్రాఫర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పికిల్ బాల్ గేమ్ ఆడేందుకు వెళ్లిన సమయంలో ఆమె ప్రైవసీకి విఘాతం కలిగిందని ఆమె ఫైర్ అయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అలియా భట్ పికిల్ బాల్ ఆడేందుకు వచ్చిన సమయంలో ఆమె కారులో నుంచి దిగుతుండగానే ఫొటోగ్రాఫర్లు అక్కడకు చేరుకుని ఫొటోలు తీయడం ప్రారంభించారు. ఆమె లోపలికి వెళ్లే క్రమంలో కొంతమంది ఫొటోగ్రాఫర్లు గేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో అలియా ఘాటుగా స్పందించారు.

 

 

సోషల్ మీడియాలో ఆలియాకు మద్దతు

వెనక్కి తిరిగి, “ప్లీజ్, మీకు లోపలికి అనుమతిలేదు. దయచేసి బయటకు వెళ్లండి,” అంటూ గేట్‌ను చూపించారు. ఆమె సహాయకుడు వెంటనే గేట్‌ను మూసేయగా, ఫొటోగ్రాఫర్లు గేటు బయటే నిలిచిపోయారు. అలియా లోపలికి వెళ్లిపోయిన తరువాత, ఫొటోగ్రాఫర్లు గేటు బయట నుంచే వీడియోలు తీశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ అలియాకు మద్దతు తెలియజేస్తున్నారు. ప్రముఖులు, సామాన్య ప్రేక్షకులు కలిసి సెలబ్రిటీల ప్రైవసీ ని ఇబ్బంది పెట్టవద్దు. అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలు తీసేందుకు ఎవరికీ హక్కు లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీలు

ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై పాపరాజీలు దృష్టి మరీ ఎక్కువవుతోంది. ప్రైవేట్ స్పేస్ లేకుండా వారిని అనుసరించడం వల్ల తగిన రీతిలో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అలియా భట్ స్పందనతో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలయ్యింది. రీసెంట్ గా సమంత విషయంలో కూడా ఇదే జరిగింది. పాపరాజీలు వరుసగా ఫోటోలు తీయ్యడం, ఏవో ప్రశ్నలు వేయడంతో సమంత విసుక్కున్నారు. ప్లీజ్ వదిలేయండి అంటూ కామెంట్లు చేశారు సమంత. సెలబ్రిటీ అయినప్పటికీ ఆమెకు కూడా వ్యక్తిగత గౌప్యత ఉండాలని సోషల్ మీడియా వేదికగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్