వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా మొదలైంది, పంచుల ప్రవాహానికి రెడీగా ఉండండి మరి

Published : Aug 15, 2025, 01:58 PM IST
Venkatesh Trivikram Movie Launched

సారాంశం

తెలుగు సినీ అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు కలయికలో సినిమా ఎట్టకేలకు స్టార్ట్అయ్యింది. ఆగస్టు 14 శుక్రవారం అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో ఈసినిమా ప్రారంభమైంది. 

DID YOU KNOW ?
24 ఏళ్ల క్రితం
వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు కథ, మాటలు అందించారు త్రివిక్రమ్ . మళ్లీ 24 ఏళ్ల తరువాత వెంకీని డైరెక్ట్ చేయబోతున్నాడు శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో సినిమా కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు స్టార్లు ఎట్టకేలకు కొత్త సినిమా కోసం చేతులు కలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. త్రివిక్రమ్ మార్క్ మేకింగ్ తో మాటల మాత్రికుడు మాయాజాలం చూపించడానికి ఓ విలక్షణమైన కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ఈ ఇద్దరితో అరుదైన కాంబినేషన్ కలిసింది. దాదాపు అన్నీ ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమాలో హిట్ మీద హిట్లు కొడుతూ వస్తోన్న వెంకటేష్ తో త్రివిక్రమ్ ఓ ఎమోషనల్ డ్రామామూవీ చేయబోతున్నట్టు సమాచారం. దాంతో ఈ కాంబోపై మరింత ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ హిట్లు కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే త్రివిక్రమ్ కూడా వెంకటేష్ సినిమాలకు డైలాగ్స్ రాసిన అనుభవం ఉంది. వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో కడుపుబ్బా నవ్వించిన పంచ్ డైలాగ్స్ త్రివిక్రమ్ రాసినవే. ఆ డైలాగ్స్ ను ఆడియన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. మరీ ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ అమ్మ కవిత అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అంతే కాదు ఈసినిమాకు కథ కూడా త్రివిక్రమ్ అందించారు.

 

ఇక ఈసారి వెంకటేషన్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే.. అది కూడా కాస్త కామెడీ బేస్ మూవీ అయితే.. ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడానికి రెడీ అవ్వాల్సిందే. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. వెంకటేష్, త్రివిక్రమ్ ఇద్దరూ ప్రత్యేకంగా మీడియా ముందుకు రాలేకపోయినప్పటికీ.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు హింట్ మాత్రం ఇచ్చారు.

 

 

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశముంది.ఇది వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఏర్పడనుంది. కుటుంబ ప్రేక్షకులకు తగ్గట్టుగా, భావోద్వేగాలు, హాస్యం, క్లాస్-మాస్ అంశాలతో మేళవించిన కథతో ఈ సినిమా రూపొందనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది చివర లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా పట్ల మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్