Alia Bhatt: అలియాభట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి వాయిదా?.. కారణం అదేనా?

Published : Nov 29, 2021, 06:04 PM IST
Alia Bhatt: అలియాభట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి వాయిదా?.. కారణం అదేనా?

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో  పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పారని గతేడాది నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా వీరి మ్యారేజ్‌కి బ్రేకులు వేసిందని అన్నారు. 

బాలీవుడ్‌లో మోస్ట్ డిజైరబుల్‌ లవ్‌ బర్డ్స్ `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ అలియాభట్‌(Alia Bhatt), రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor). గత మూడేళ్లు వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అధికారికంగానే వీరిద్దరు ప్రేమలో ఉండటం విశేషం. ఇద్దరి కుటుంబ సభ్యలకు వీరి ప్రేమ విషయం తెలియడంతో రెచ్చిపోయి ప్రేమ పాఠాలు చెప్పుకుంటున్నారు. ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. ఓ వైపు ఎవరికి వాళ్లు సినిమాలతో బిజీగా ఉంటూనే, టైమ్‌ దొరికినప్పుడు ప్రేమని పంచుకుంటున్నారు. హుందాతనంతో కూడిన ప్రేమ జంటగా పేరుతెచ్చుకున్నారు. 

ఇదిలా ఉంటే త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పారని గతేడాది నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా వీరి మ్యారేజ్‌కి బ్రేకులు వేసిందని అన్నారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మ్యారేజ్‌ చేసుకునే అవకాశాలున్నట్టు ప్రచారం జరిగింది. మరోవైపు సెకండ్‌ వేవ్ కారణంగా ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి. సెకండ్‌ వేవ్‌ తగ్గిన తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలలో వీరి వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్‌ చేశారనే వార్త వైరల్ అయ్యింది. 

కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు మరోసారి అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మ్యారేజ్‌ని వాయిదా వేశారని తెలుస్తుంది. ఇద్దరూ ఎవరికి వారు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు ఒప్పుకోవడం, ఇతర పలు కారణాలతో వీరి మ్యారేజ్‌ని మరో ఏడాది వాయిదా వేశారట. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా ఈ ఇద్దరు పెళ్లి పీఠలెక్కబోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కమిటైన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారట. విదేశాల్లో పెళ్లి అంటే చాలా ముందు నుంచే పక్కా ప్లాన్‌ చేసుకోవాలి.  అన్ని పనులు పూర్తి చేసి ఫ్రీ టైమ్‌ తీసుకుని పెళ్లి చేసుకోనున్నారట.

 పెళ్లి వాయిదాకు మరో కారణం కూడా ఉందట. ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ కలిసి ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. తమ డ్రీమ్‌ హోమ్‌గా దీన్ని నిర్మిస్తున్నారని, వచ్చే ఏడాదిలో ఇది పూర్తి అవుతుందట. అన్ని రకాలుగా ఆ ఇంటిని పూర్తి చేసుకుని, డైరెక్ట్ గా మ్యారేజ్‌ చేసుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టాలని ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసమే మ్యారేజ్‌ ని వాయిదా వేసుకున్నట్టు బాలీవుడ్‌ టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం అలియా భట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె అల్లూరి సీతారామరాజు పాత్రని పోషిస్తున్న రామ్‌చరణ్‌కి జోడీగా సీత పాత్రలో నటిస్తుంది. మరోవైపు హిందీలో `గంగూబాయ్‌ కథియవాడి`, `బ్రహ్మాస్త్ర`, `డార్లింగ్స్‌`(నిర్మాత కూడా), `రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌ `బ్రహ్మాస్త్ర`, `షంషేరా`తోపాటు లవ్‌ రంజన్‌ చిత్రంలో నటిస్తున్నాడు. 

also read: Katrina Kaif: కత్రినా, విక్కీ కౌశల్ వివాహం.. అతిథుల కోసం 45 హోటల్స్ బుకింగ్, ఓమిక్రాన్ భయంతో..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?