RRR Trailer: నేషనల్‌ వైడ్‌గా పూనకాలకు సర్వం సిద్ధం.. `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ డేట్‌ కన్ఫమ్‌

Published : Nov 29, 2021, 04:29 PM ISTUpdated : Nov 29, 2021, 05:10 PM IST
RRR Trailer:  నేషనల్‌ వైడ్‌గా పూనకాలకు సర్వం సిద్ధం.. `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ డేట్‌ కన్ఫమ్‌

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇక నేషనల్‌ వైడ్‌గా పూనకాలకు రెడీ అవ్వండి అంటూ ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్‌నిచ్చింది యూనిట్‌.

ఇండియన్‌ ప్రిస్టీజియస్‌ ఫిల్మ్ `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). `బాహుబలి` లాంటి సంచలనాత్మక చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రమిది. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి నటిస్తున్నారు. ఇండియన్‌ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్‌ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. 

ఇక నేషనల్‌ వైడ్‌గా పూనకాలకు రెడీ అవ్వండి అంటూ ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్‌నిచ్చింది యూనిట్‌. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ట్రైలర్‌(RRR Trailer)ని డిసెంబర్‌ 3న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్‌ 3 కోసం మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి అన్ని రికార్డులు బ్రేక్‌ కావడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ పాత్ర గ్లింప్స్ ని విడుదల చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ గ్లింప్స్ ని రిలీజ్‌ చేశారు. దీంతోపాటు మేకింగ్‌ వీడియోని రిలీజ్‌ చేశారు. ఇటీవల మరో టీజర్‌ని రిలీజ్‌ చేయగా అది సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మార్చింది. సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. అలాగే రెండు పాటలు కూడా వచ్చాయి. ఇటీవల విడుదలైన `ఆర్‌ఆర్‌ఆర్‌సోల్‌ ఆంథెమ్‌` ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. 

దీంతో ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేయబోతున్నారు. జస్ట్ డేట్‌ అనౌన్స్ మెంటే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక నిజంగానే ట్రైలర్‌ వస్తే ఇద్దరు హీరోల అభిమానులు ఆపడం ఎవరి తరం కాదేమో అంటున్నారు నెటిజన్లు. మరి ట్రైలర్‌ ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాని జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

also read: RRR: కన్నీళ్లు ఆగడం లేదంటూ ప్రభుత్వాలకి హీరో నిఖిల్ రిక్వెస్ట్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!