
రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా మారుతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ పెంచాయి. విజయ్ కి స్పెషల్ ఫాలోయింగ్ వచ్చింది. విజయ్ తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో యువతని మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఇంటర్నేషనల్ క్రేజ్ ఏర్పడింది. అందుకు కారణం లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్. మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైగర్ టీం యుఎస్ లో చక్కర్లు కొడుతోంది. లాస్ వేగాస్, లాస్ ఏంజిల్స్ లాంటి ప్రాంతాల్లో పూరి జగన్నాధ్.. విజయ్ దేవరకొండ, అనన్య పాండేపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛార్మి, అనన్య పాండే భుజాలపై రౌడీ హీరో చేతులు వేసి స్టైల్ గా ఫోజు ఇచ్చాడు. వారి పక్కనే పూరి జగన్నాధ్ కూడా ఉన్నారు. 'హలో ఫ్రమ్ లాస్ ఏంజిల్స్' అని విజయ్ దేవరకొండ ఈ ఫోటోకి కామెంట్ పెట్టాడు.
అనన్య పాండే నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. అనన్యకి కూడా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె సోయగాలు కుర్రాళ్లు దాసోహమవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఈ లైగర్ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
హీరోలని మాస్ యాటిట్యూడ్ తో చూపించాలనే పూరి తర్వాతే ఎవరైనా. అలాంటి పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తుండడం యువతలో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ తన యాటిట్యూడ్, మ్యానరిజమ్స్ తో యువతని మాయ చేశాడు.