ఆసుపత్రిలో చేరిన అక్షయ్‌ కుమార్‌..ఆందోళనలో ఫ్యాన్స్

Published : Apr 05, 2021, 02:53 PM IST
ఆసుపత్రిలో చేరిన అక్షయ్‌ కుమార్‌..ఆందోళనలో ఫ్యాన్స్

సారాంశం

అక్షయ్‌ కుమార్‌కి ఆదివారం కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. ఈ మేరకు అక్కీ ట్వీట్‌ చేశారు. 

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆదివారం కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. ఈ మేరకు అక్కీ ట్వీట్‌ చేశారు. `నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి, చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞుడినై ఉంటాను. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు, ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతి త్వరలోనే కోలుకుని ఇంటికి సురక్షితంగా వస్తానని ఆశిస్తున్నారు. మీరంతా జాగ్రత్తగా ఉండండి` అని పేర్కొన్నాడు అక్షయ్‌. 

ఇప్పటికే అక్షయ్‌తోపాటు అమిర్‌ ఖాన్‌, అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తీక్‌ అర్యన్‌ కరోనాకి గురయ్యారు. వారంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్‌ కరోనా అనే వార్త బాలీవుడ్‌ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు అక్షయ్‌ ఆసుపత్రిలో చేరారని చెప్పడంతో ఆయన అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వేలల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం గమనార్హం. 

ఇదిలా ఉంటే అక్షయ్‌ కుమార్‌ ఇప్పటికే ఓ సారి కరోనాకి గురయ్యారు. `లక్ష్మీ` సినిమా సమయంలో ఆయనకు కరోనా సోకింది. దాన్నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరోసారి కరోనా పాజిటివ్‌ రావడం విచారకరం. ప్రస్తుతం `రామ్‌సేతు` షూటింగ్‌లో ఆయనకి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్షయ్‌ `రామ్‌సేతు`, `సూర్యవంశీ`, `బేల్‌ బాటమ్‌`, `ఆట్రాంగి రే`, `పృథ్వీరాజ్‌`, `బచ్చన్‌ పాండే` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు అక్షయ్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ
చిరంజీవి తన భార్య సురేఖకు నేర్పించిన రెండు స్పెషల్ వంటలు ఏంటో తెలుసా? అల్లు వారిపై మెగాస్టార్ ఫన్నీ కౌంటర్