మరో సౌత్‌ సినిమాపై సల్మాన్‌ కన్ను.. విజయ్‌ సినిమా రీమేక్‌?

Published : Apr 05, 2021, 02:26 PM IST
మరో సౌత్‌ సినిమాపై సల్మాన్‌ కన్ను.. విజయ్‌ సినిమా రీమేక్‌?

సారాంశం

సల్మాన్‌ ఖాన్‌ మరో రీమేక్‌ సినిమా చేయబోతున్నాదని సమాచారం. ఇటీవల దళపతి విజయ్‌ హీరోగా రూపొందిన `మాస్టర్‌` చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మిశ్రమ స్పందన రాబట్టుకున్నా, తమిళంలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. 

సల్మాన్‌ ఖాన్‌ సౌత్‌ సినిమాలతో కమర్షియల్‌ హీరోగా ఎదిగారు. తెలుగులో వచ్చిన `పోకిరి`, `రెడీ`, `కిక్‌` చిత్రాలతో సూపర్‌ హిట్స్ అందుకున్నారు. ఆయనకు సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ రావడంతో సౌత్‌ సినిమాల రీమేక్‌లు కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. తాజాగా ఆయన మరో రీమేక్‌ సినిమా చేయబోతున్నాదని సమాచారం. ఇటీవల దళపతి విజయ్‌ హీరోగా రూపొందిన `మాస్టర్‌` చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మిశ్రమ స్పందన రాబట్టుకున్నా, తమిళంలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీనికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాని సల్మాన్‌ ఖాన్‌ రీమేక్‌ చేయబోతున్నట్టు తెలుస్తుంది. హిందీ రైట్స్ ని నిర్మాత మురాద్‌ ఖేతని దక్కించుకున్నారు. ఆయన అంతకు ముందు `కబీర్‌సింగ్‌` చిత్రాన్ని నిర్మించారు. ఇది సల్మాన్‌ చేస్తే బాగుంటుందని ఆయన్ని సంప్రదించారట. అయితే ఈ కథకి సల్మాన్‌ ఇంప్రెస్‌ అయ్యారట. కొన్ని మార్పులతో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగిదే సినిమా ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనుందని టాక్‌. 

ప్రస్తుతం సల్మాన్‌ `రాధే` చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు `అంతిమ్‌ః ది ఫైనల్‌ ట్రూత్‌`, `టైగర్‌3` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు `లాల్‌ సింగ్‌ చద్దా`, `పఠాన్‌`లో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?