రిపబ్లిక్ టీజర్: వ్యవస్థలను, పాలకులను ప్రశ్నిస్తున్న సాయి ధరమ్!

Published : Apr 05, 2021, 01:32 PM IST
రిపబ్లిక్ టీజర్: వ్యవస్థలను, పాలకులను ప్రశ్నిస్తున్న సాయి ధరమ్!

సారాంశం

రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్స్ మాత్రమే చేసిన సాయి ధరమ్ మొదటిసారి పొలిటికల్ థ్రిల్లర్ ని ఎంచుకున్నారు. దర్శకుడు  దేవా కట్టా రిపబ్లిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు రిపబ్లిక్ చిత్ర టీజర్ ని విడుదల చేశారు.   

వరుస విజయాలతో ఊపుమీదున్న సాయి ధరమ్ తేజ్... రిపబ్లిక్ అంటూ పొలిటికల్ అండ్ సోషల్ సబ్జెక్టు తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పటి వరకు రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్స్ మాత్రమే చేసిన సాయి ధరమ్ మొదటిసారి పొలిటికల్ థ్రిల్లర్ ని ఎంచుకున్నారు. దర్శకుడు  దేవా కట్టా రిపబ్లిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు రిపబ్లిక్ చిత్ర టీజర్ ని విడుదల చేశారు. 

నిమిషానికి పైగా సాగిన టీజర్, సాయి ధరమ్ పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ తో సాగింది. వ్యవస్థలో, పాలనలో ఉన్న లోపాలను, పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్న వ్యవస్థలను ప్రశ్నించేవిగా ఆయన డైలాగ్స్ ఉన్నాయి. ఇక సాయి ధరమ్ ఉన్నతమైన చదువు కలిగిన అధికారిగా కనిపిస్తున్నారు.

 
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ లుక్ ఆసక్తి రేపుతోంది. ఇక టీజర్ లో మణిశర్మ బీజీఎమ్ అద్భుతం అని చెప్పాలి. టీజర్ లో మణిశర్మ మ్యూజిక్ ప్రత్యేకంగా నిలిచింది. ప్రస్థానం సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్టా నుండి ఆ స్థాయి చిత్రం మరలా రాలేదు. రిపబ్లిక్ మూవీతో మరలా ఆయన ట్రాక్ లోకి వస్తాడని అనిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక రోల్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది