`కన్నప్ప`లోకి అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీ.. మంచు విష్ణు `కల్కి2898ఏడీ`ని టార్గెట్‌ చేశాడా ఏంటి?

Published : Apr 16, 2024, 10:07 AM IST
`కన్నప్ప`లోకి అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీ.. మంచు విష్ణు `కల్కి2898ఏడీ`ని టార్గెట్‌ చేశాడా ఏంటి?

సారాంశం

మంచు విష్ణు ప్లాన్‌ మామూలుగా లేదు. ఊహించని కాస్టింగ్‌ని `కన్నప్ప`లోకి దించుతున్నాడు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ని తీసుకొచ్చాడు. `కల్కి`కి పోటీ ఇస్తున్నాడు.   

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `కన్నప్ప`. ఈ మూవీలోకి  ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్న కాస్టింగ్‌ చూస్తుంటే మతిపోతుంది. అన్ని భాషల నుంచి పెద్ద పెద్ద స్టార్స్ ని దించుతున్నాడు మంచు మోహన్‌బాబు, హీరో మంచు విష్ణు. ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్‌ని దించాడు. బ్రహ్మానందం నటిస్తున్నారు. అలాగే మోహన్‌బాబు కనిపిస్తాడు. 

కన్నడం నుంచి శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్‌ నటిస్తున్నారు. తమిళంలో శరత్‌ కుమార్‌ నటిస్తున్నారు. నయనతార పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌ వంతు వచ్చింది. అందులోనూ పెద్ద సూపర్‌ స్టార్‌ని దించాడు మంచు విష్ణు. ఏకంగా అక్షయ్‌ కుమార్‌ని తీసుకొచ్చాడు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ `కన్నప్ప` షూటింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు కలిసి ఆయనకు ఆహ్వానం పలికారు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. 

ఈ మేరకు మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీతో `కన్నప్ప` మూవీ జర్నీ మరింత థ్రిల్లింగ్‌గా మారింది. ఈ మూవీతో అక్షయ్‌ కుమార్‌ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారని ప్రకటించడం చాలా సంతోషంగా, థ్రిల్‌గా ఫీలవుతున్నాను. ఎప్పటికీ మర్చిపోలేని అడ్వెంచర్‌కి రెడీ అవ్వండి` అంటూ విష్ణు పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

హిందీ దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీని మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. సుమారు వంద కోట్లతో మైథలాజికల్‌ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఇప్పుడు భారీ కాస్టింగ్‌ యాడ్‌ కావడంతో సినిమా రేంజ్‌ మరింతగా పెరిగిపోతుంది. బడ్జెట్‌ కూడా భారీగా పెరుగుతుందని చెప్పొచ్చు. మరి ఇంతటి బడ్జెట్‌తో సినిమా అంటే పెద్ద రిస్కే అని చెప్పొచ్చు. పాన్‌ ఇండియన్‌ మూవీగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. 

ఇదిలా ఉంటే చూస్తుంటే మంచు విష్ణు.. ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`ని టార్గెట్‌ చేసినట్టుంది.ఆ మూవీలోనే భారీ కాస్టింగ్‌ ఉంది. ప్రభాస్‌తోపాటు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, దుల్కర్‌ సల్మాన్‌, రానా, విజయ్‌ దేవరకొండ వంటి వారు కనిపిస్తున్నారు. ఇప్పుడు `కన్పప్ప` కూడా అలానే ఉంది. ఓ రకంగా `కల్కి`తో మంచు విష్ణు పోటీ పడుతున్నాడని, దాన్ని కొట్టేలా కాస్టింగ్‌ని దించుతున్నట్టు అనిపిస్తుంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే