`ఎస్‌ఎస్‌ఎంబీ29` కోసం ఆ పని చేస్తున్న మహేష్‌ బాబు.. పాపం రాజమౌళి నిద్ర లేకుండా చేస్తున్నాడుగా!

Published : Apr 15, 2024, 08:46 PM ISTUpdated : Apr 15, 2024, 10:14 PM IST
`ఎస్‌ఎస్‌ఎంబీ29` కోసం ఆ పని చేస్తున్న మహేష్‌ బాబు.. పాపం రాజమౌళి నిద్ర లేకుండా చేస్తున్నాడుగా!

సారాంశం

రాజమౌళి సినిమా కోసం చెమట చిందిస్తున్నారు మహేష్‌ బాబు. ఓ రకంగా సూపర్‌ స్టార్‌కి జక్కన్న నిద్ర లేకుండా చేస్తున్నాడు. తాజాగా స్కేటింగ్‌ నేర్చుకుంటున్నాడట.   

రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. హీరోలని పిండేస్తుంటాడు జక్కన్న. నటన పరంగానూ డాన్స్ ల పరంగా ఏ విషయంలోనూ రాజీపడడు. తనకు అనుకున్నట్టుగా పర్‌ఫెర్మెన్స్ రావాల్సిందే. ఆ విషయంలో ఏమాత్రం తగ్గడు. అందుకే ఆయనతో సినిమా అంటే నటులకు నరకంలాగే ఉంటుంది. ఒళ్లు హూనం కావాల్సిందే. ప్రభాస్‌ అయినా, ఎన్టీఆర్‌ అయినా, రామ్‌ చరణ్‌ అయినా, రావితేజ అయినా, సునీల్‌ అయినా ఎవరిని వదిలిపెట్టరు. 

ఇప్పుడు అలాంటి కష్టం మహేష్‌ బాబుకి వచ్చింది. సూపర్‌స్టార్‌కి చుక్కలు చూపిస్తున్నాడు రాజమౌళి. మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం రెడీ అవుతున్నాడు మహేష్‌. ఆ మధ్య విదేశాలకు వెళ్లి ఫిట్‌నెస్‌ లో ట్రైన్‌ అయ్యాడు. ఇప్పుడు రెగ్యూలర్‌గా అది ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఆ మధ్య గెటప్‌ పరంగానూ వర్కౌట్స్ చేశాడు. నయా లుక్‌లోకి మారిపోయాడు. ఇప్పుడు మరోటి నేర్చుకుంటున్నారు మహేష్‌ బాబు. 

తాజాగా స్కేటింగ్‌ నేర్చుకుంటున్నాడట మహేష్‌ బాబు. ప్రపంచ సాహసికుడిగా అనేక అడ్వెంచర్స్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో అందుకోసం ట్రైన్‌ అవుతున్నారట మహేష్‌. అందులో భాగంగానే ఇప్పుడు స్కేటింగ్‌ నేర్చుకుంటున్నాడట. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం వర్క్ షాప్‌ నిర్వహిస్తున్నారట రాజమౌళి. మహేష్‌ బాబుతో ఈ వర్క్ షాప్‌ చేయిస్తున్నారట. ఏం చేయాలనేది ముందుగానే ఓ అవగాహనకు వచ్చేందుకు వర్క్ షాప్‌ ప్లాన్‌ చేస్తున్నారట దర్శకుడు. ప్రస్తుతం అందులో మహేష్‌ చెమటోడుస్తున్నాడని తెలుస్తుంది. ఓ రకంగా మహేష్‌కి రాజమౌళి నిద్ర లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు. 

ఇక ఈ మూవీకి భారీ కాస్టింగ్‌తోపాటు టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ నాథ్‌ బింగిని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కమల్‌ కన్నన్‌కి అప్పగించారు. అలాగే ఇందులో ఇండోనేషియన్‌ నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారని అంటున్నారు. మరోవైపు నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని అన్నారు. అలాగే బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. మరోవైపు ఇందులో మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం అనే వార్త కూడా వచ్చింది. ఇక ఈ మూవీకి రెండు టైటిల్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. `మహారాజా`, `చక్రవర్తి` అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా