
వరుణ్‌తేజ్, అధర్వ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గద్దలకొండ గణేష్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయ్యింది. కాగా, ఇప్పుడు ఇదే కథతో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘బచ్చన్‌పాండే’. ఫర్హద్ సామ్‌జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 18న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈనేపథ్యంలో తెలుగువారిలోనూ ‘బచ్చన్‌పాండే’రిజల్ట్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి.
‘బచ్చన్‌పాండే’ అనే రౌడీగా అక్షయ్‌కుమార్ ఊరమాస్, రఫ్ లుక్‌లో భయపెట్టారు. ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. ‘కశ్మీర్ ఫైల్స్’ పోటీని తట్టుకుని తొలి రోజు మంచి వసూళ్లే సాధించడంతో చిత్ర టీమ్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాకు తొలి రోజు ఇండియాలో రూ.13 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఎక్సపెక్ట్ చేయలేదు. కృతిసనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వార్సి కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆకట్టుకుంది.
‘‘మన పవర్ తగ్గకూడదంటే ఎదుటివారిలో భయాన్ని సృష్టించాలి’’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక, తమ నేటివిటీకి తగ్గట్లు కథలో కాస్త మార్పులు చేసినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. తెలుగులో ఆధ్వర్య పోషించిన పాత్రను హిందీలో నటి కృతిసనన్ చేశారు. అక్షయ్‌కుమార్ ప్రేయసి పాత్రలో నటి జాక్వెలిన్ నటించారు. అయితే గద్దలకొండ గణేష్ లైన్ ని మాత్రం వాడుకొని పాత్రలు, కథాంశం మార్చినట్లు సినిమా చూస్తుంటే తెలుస్తోంది. కరుడుగట్టిన ఒక గ్యాంగస్టార్ బయోపిక్ ని తీయడానికి లేడీ డైరెక్టర్ అయినా కృతిసనన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఆమె, అతడి స్నేహితుడు అర్షద్ వార్సి సహాయం తీసుకొంటుంది. ఇక అన్నిచోట్లా తిరిగి బచ్చన్ పాండే రౌడీయిజం గురించి తెలుసుకొని అతడి కథను సినిమాగా తీద్దామని అతడిని ఎలాగోలా ఒప్పించి షూటింగ్ స్టార్ట్ చేస్తోంది.
ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో మరణించిన బచ్చన్ పాండే ప్రేమికురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కనిపించింది. అస్సలు బచ్చన్ పాండే కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ లా ఎలా మారాడు..? ఎందుకు మారాల్సి వచ్చింది. గతంలో బచ్చన్ పాండే లవ్ స్టోరీ ఏంటి..? చివరకు లేడీ డైరెక్టర్ క్రూరమైన గ్యాంగ్ స్టార్ బయోపిక్ ని తీసిందా..? అనేది తెరపై చూడాలి అంటున్నారు మేకర్స్. బచ్చన్ పాండే లుక్ లోఅక్షయ్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పొచ్చు. గుబురు గడ్డం..మాస్ లుక్ లో వరుణ్ తేజ్ గడ్డలకొండ గణేష్ గా బాగానే భయపెట్టిన సంగతి తెలిసిందే. ఇక బచ్చన్ పాండేగా అక్షయ్ కుమార్ లుక్ ఇంకా భయంకరంగా ఉంది. మరి గడ్డలకొండ గణేష్ కన్నా బచ్చన్ పాండే ఎక్కువ బయపెడతాడేమో చూడాలంటే మరో నాలుగు రోజులు వరకూ ఆగాల్సిందే.
ఇక ఈ వారం అంతటా కశ్మీర్ ఫైల్స్ గురించే టాక్ నడుస్తోంది. క్రితం వారం రిలీజైన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ను తీసేసి థియేటర్లలో ‘కశ్మీర్ ఫైల్స్’ వేసే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకూ స్క్రీన్లు, కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది ‘కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా కలెక్షన్స్ ను చూసి అక్షయ్ కుమార్ తన ‘బచ్చన్ పాండే’ను ఈ నెల 18న రిలీజ్ చేయాలా వద్దా అన్న సంశయం లో పడ్డారు. ఒక దశలో వాయిదా గురించి కూడా మేకర్స్ ఆలోచించినట్లు వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఇంకో డేట్ దొరకడం కష్టమని భావించి 18నే ధైర్యం చేసి రిలీజ్ చేసేశారు. అయినా హిట్ టాక్ వచ్చింది.