రికార్డు ధరకి RRR హైదరాబాద్ బెనిఫిట్ షోలు.. భీమ్లా నాయక్ నిర్మాత కొనేశాడా ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 20, 2022, 03:10 PM IST
రికార్డు ధరకి RRR హైదరాబాద్ బెనిఫిట్ షోలు.. భీమ్లా నాయక్ నిర్మాత కొనేశాడా ?

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మార్చి 25 శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. గురువారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల సందడి షురూ కానుంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మార్చి 25 శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. గురువారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల సందడి షురూ కానుంది. ఆర్ఆర్ఆర్ టికెట్ లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

బెనిఫిట్ షోలకు ఏపీలో అనుమతి లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనితో హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు. భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాధ్, అర్జున్, విజేత, శ్రీరాములు థియేటర్స్ లో బెనిఫిట్ షోలో ఖరారైనట్లు తెలుస్తోంది. రాత్రి 1 గంటకు ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నట్లు టాక్. 

నైజాం ఏరియాలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బెనిఫిట్ షోలని దిల్ రాజు.. భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, అతని స్నేహితులకు రికార్డు ధర రూ 1 కోటికి అమ్మేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోలు భీమ్లా నాయక్ నిర్మాత చేతుల్లోకి వచ్చాయి. 

నాగవంశీ ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఆస్ట్రేలియాలో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ బెనిఫిట్ షోలకు టికెట్ ధర రూ 5 వేల వరకు పలుకుతున్నట్లు టాక్. ఆర్ఆర్ఆర్ చిత్రం భారీ బడ్జెట్ లో నిర్మించిన చిత్రం కావడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాయి. 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి