RRR Team : స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ టీం.. గుజరాత్ లో విశేష స్పందన..

Published : Mar 20, 2022, 02:57 PM IST
RRR Team : స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ టీం..  గుజరాత్ లో విశేష స్పందన..

సారాంశం

గుజరాత్ అంతటా ‘ఆర్ఆర్ఆర్’ మాటే వినిపిస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా గుజరాత్ కు వెళ్లిన ఈ మూవీ టీంకు విశేష స్పందన లభించింది. నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ను పూర్తి చేసుకున్న ఈ టీం గుజరాత్ కు చేరుకుంది.

దర్శకధీరుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  రాజౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ RRR మూవీ కోసం దేశ్యాప్తంగా, పలు దేశాల్లో ఆడియెన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దుబాయి, కర్ణాటకలో ప్రమోషన్స్, మీడియా ఇంటరాక్ట్ కార్యక్రాలకు పూర్తి చేసుకున్నారు. నిన్న కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి చేసుకున్న ఈ యూనిట్ తాజాగా గుజరాత్ కు చేరుకుంది. 

గుజరాత్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఓ రేంజ్ లో చిత్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఆర్ఆర్ ఆర్ టీంకు మంచి స్పందన వస్తోంది. ఎయిర్ పోర్టు, బరోడా టౌన్ లో కారులపై ఆర్ఆఆర్ఆర్ పోస్టర్లను అంటించి భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. గుజరాత్ కు చేరుకున్న ఈ టీం ముందుగా బరోడా లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కివాడీయా..  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ అయిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది. వీరికి సంబంధించిన ఫొటోలు, అక్కడ మీడియాతో వారు మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (Statue Of Unity) వద్ద ఆర్ఆర్ఆర్ టీంకు సంబంధించిన పలు ఫొటోలను చిత్ర యూనిట్ అఫిషియల్ గా రిలీజ్ చేసింది. ఈ ఫొటోల్లో దర్శకధీరుడు జక్కన్న రెడ్ షర్ట్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. వీరు ముగ్గురు కలిసిన ఒక ఫొటోలో చూడవచ్చు. అలాగే ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. దోస్తీని తెలుపుతూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ చేతులను గట్టిగా పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. రామ్ చరణ్ మరింత అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని,రాజమౌళి డైరెక్ట్ చేశారు. అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రమోషన్స్ నిర్వహిస్తున్న  తొలిచిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలిచిపోనుంది. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ చిత్రంలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) నటించింది. మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకకుల ముందుకు రానుంది. మూవీకి ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణీ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఎత్తర జెండా, నాటు నాటు సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి