- బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న బాస్ ఖైదీ నెంబర్ 150
- వంద కోట్ల షేర్ సాధించిన ఖైదీ నెంబర్ 150
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ సాధించాడు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 వంద కోట్ల షేర్ సాధించి మరోసారి చిరంజీవి సత్తా చాటింది. విడుదలైన తొలి వారంలోనే వంద కోట్ల పైగా గ్రాస్ సాధించిన మెగాస్టార్ మూవీ ఇప్పుడు 100కోట్ల రూపాయల షేర్ సాధించింది. రామ్ చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీ అంతా సెలిబ్రేషన్ మోడ్ లో ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా రూపొందిన చిత్రం `ఖైదీ నంబర్ 150`. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైంది. దాదాపు పదేళ్ళ తర్వాత చిరు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం, వినాయక్ సినిమాను తెరకెక్కించిన తీరు రిలీజ్ రోజు నుండి కలెక్షన్స్ వర్షాన్ని కురిపించాయి. బాహుబలి తర్వాత నెక్ట్స్ రేంజ్ కలెక్షన్స్‌ను సాధిస్తూ, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. విడుదలైన తొలి వారానికే 108కోట్ల గ్రాస్‌ను సాధించిన ఈ చిత్రం 100 కోట్ల షేర్‌ను సాధించింది. సినిమాల్లో చిరు మరోసారి మెగాస్టార్‌గా తన సత్తా నిరూపించారు.