ఇంతకీ సమంత జర్నలిస్టా లేక జమునా?

Published : Mar 11, 2017, 09:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఇంతకీ సమంత జర్నలిస్టా లేక జమునా?

సారాంశం

మమహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా సినీ రంగంలో మమకుటంలేని మహారాణిగా వెలుగొందిన సావిత్రి సావిత్రి జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, సినీజీవితంపై సినిమా

‘మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వెండితెరపై తాజా వెలుగులు పూయనున్నాయి. భారతీయ చలనచిత్ర సీమలో మరువలేని, మరపురాని మహానటి సావిత్రి. ఆమె సినీ జీవితం నేటి నటీమణులకు స్ఫూర్తి అయితే వ్యక్తిగత జీవితం ఒక పాఠం. అలాంటి పలు ఆసక్తికరమైన సావిత్రి జీవితకథను మహానటి పేరుతో తెలుగులోనూ, నడిగైయన్  తిలగం పేరుతో తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కనుంది. యువ దర్శకుడు నాగఅశ్విన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ నటించనుంది.

 

ఈ పాత్ర కోసం ఈ బ్యూటీ తనను సావిత్రి రూపంలోకి మలచుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో చెన్నై చిన్నది సమంత కూడా ఒక ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. ఆమె పాత్ర ఏమటన్నదానికి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట నటి సావిత్రి సమకాలీన నటి జమున. ఆ పాత్రగా నటి సమంత మారనుందని సమాచారం. జమున కూడా తన అసాధారణ నటనతో తమిళం, తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకున్న గొప్పనటి.

 

అయితే మహానటి సావిత్రి జీవిత కథా చిత్రంలో నటి జమున పాత్ర ఏమిటన్నది ఆసక్తికరమైన అంశం. సావిత్రి, జమున మంచి స్నేహితురాళ్లు, ఒక సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని అంటారు. అలాంటి అంశాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించనున్నారా? అదే విధంగా నటి సావిత్రి జీవితంలో నటుడు, ఆమె భర్త జెమినీగణేశన్ ది కీలక పాత్ర. ఈ చిత్రంలో ఆయన పాత్రను ఎవరు పోషించనున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న నడిగైయన్ తిలగం(మహానటి) చిత్రంపై చిత్ర పరిశ్రమలో కుతూహలం నెలకొందన్నది మాత్రం నిజం. మరోవైపు సమంత ఓ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోందని టాక్ ఉంది. ఇంతకీ సమంత జమునా లేక జర్నలిస్టా... మరి కొంత కాలం పోతేగాని చెప్పేలా లేరు..

PREV
click me!

Recommended Stories

Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..