పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాలని బ్యాలన్ చేస్తూనే వచ్చే ఎన్నికల్లోపు వీలైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించాలని పవన్ భావిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాలని బ్యాలన్ చేస్తూనే వచ్చే ఎన్నికల్లోపు వీలైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించాలని పవన్ భావిస్తున్నాడు. పవన్ ప్రస్తుతం కమిటై ఉన్న సినిమాలని పూర్తి చేసి నటనకు స్వస్తి చెబుతారని.. పూర్తి స్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.
Pawan Kalyan ప్రస్తుతం Bheemla Nayak, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రాలు చేయాల్సి ఉంది. వీటిలో Hari Hara Veeramallu చిత్రం పవన్ అభిమానులని ఎక్కువగా ఆకర్షిస్తోంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. పైగా పవన్ ఎప్పుడూ టచ్ చేయని పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది.
పవన్ తన కెరీర్ లో చేసిన అన్ని చిత్రాలతో పోల్చుకుంటే హరి హర వీరమల్లు పూర్తిగా భిన్నం. ఔరంగజేబు కాలం నాటి కథతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆసక్తిని రెట్టింపు చేసేలా క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తనయుడు Akira Nandan చిన్న పాత్రలో మెరవబోతున్నాడట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్రసాములు, గుర్రపు స్వారీలు ఈ చిత్రంలో ఎక్కువగా ఉండబోతున్నాయి. అకిరా పోషించేది చిన్న పాత్రే అయినప్పటికీ పవన్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని అకీరాకు కర్రసాములో శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అకీరాపై పవన్ అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఆరడుగుల మించిన పొడవుతో అకిరా అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు. అకిరా మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి కొణిదెల వారసుడి అసలైన ఎంట్రీ ఎప్పుడో!